విజయనగరంలో బాబు మూడురోజుల టూర్.. పోటెత్తిన‌ జనం!

రాజాం.. బొబ్బిలి.. విజయనగరంలో రోడ్ షో విధాత‌: చాన్నాళ్ల తరువాత మళ్ళీ చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టారు. నిన్నటి ఖమ్మం టూర్ భారీగా సక్సెస్ కావడంతో అదే ఉత్సాహంతో ఇప్పుడు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. 22, 23, 24 తేదీల్లో మూడురోజుల పాటు రాజాం.. విజయనగరం.. బొబ్బిలి నియోజకవర్గాల్లో రోడ్ షో.. బహిరంగ సభల్లో పాల్గొంటారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఎంపీ స్థానాన్ని కోల్పోయిన టిడిపి […]

విజయనగరంలో బాబు మూడురోజుల టూర్.. పోటెత్తిన‌ జనం!
  • రాజాం.. బొబ్బిలి.. విజయనగరంలో రోడ్ షో

విధాత‌: చాన్నాళ్ల తరువాత మళ్ళీ చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టారు. నిన్నటి ఖమ్మం టూర్ భారీగా సక్సెస్ కావడంతో అదే ఉత్సాహంతో ఇప్పుడు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. 22, 23, 24 తేదీల్లో మూడురోజుల పాటు రాజాం.. విజయనగరం.. బొబ్బిలి నియోజకవర్గాల్లో రోడ్ షో.. బహిరంగ సభల్లో పాల్గొంటారు.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఎంపీ స్థానాన్ని కోల్పోయిన టిడిపి కోలుకోలేని దెబ్బ తినేసింది. క్యాడర్ మొత్తం చెల్లా చెదురైంది. జిల్లాలోని చాలా పంచాయతీలు, మండల పరిష‌త్‌లు, మొత్తం 34 జడ్పిటిసి స్థానాలు గెలుచుకుని వైసిపి విజయగర్వంతో తొణికిసలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని నిలబెట్టి రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు.

మూడురోజుల టూర్ లో రాజాం లో రోడ్ షోతో పాటు అక్కడ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. 23న బొబ్బిలిలో బహిరంగ సభతోబాటు ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని కూడా చేపడుతారు. 24న చంద్రబాబు విజయనగరంలో అక్కడ రోడ్ షో తోబాటు బహిరంగ సభలో మాట్లాడతారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చినపుడు ఆయనకు టీడీపీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. గతంలో బాబు కోసం వచ్చిన దాని కంటే ఎక్కువగా కార్యకర్తలు రావడం విశేషం. వారికి అభివాదం చేస్తూ బాబు విజయనగరం వెళ్లారు. 2024 ఎన్నికలకు పార్టీని పూర్తిగా సిద్ధం చేసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని క్యాడర్ నమ్మకంతో ఉంది.