బాలయ్య షోకు చరణ్, కేటీఆర్..!
విధాత: మొత్తానికి ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2 సీజన్లో పాల్గొనాలని కోరుకునే అతిధుల సంఖ్య పెరిగిపోతోంది. అందులో వస్తున్న వారంతా చిన్నచితకా వారు కాదు. ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి వారు. ఇప్పటివరకు ఇలాంటి టాక్ షోలకు దూరంగా ఉన్న వారు సైతం బాలయ్య షోకి ఓకే చెబుతున్నారు. ఒక్కసారిగా ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2 సీజనులో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ మొదటి భాగాన్ని డిసెంబరు 30న విడుదల చేయగా ఆ […]

విధాత: మొత్తానికి ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2 సీజన్లో పాల్గొనాలని కోరుకునే అతిధుల సంఖ్య పెరిగిపోతోంది. అందులో వస్తున్న వారంతా చిన్నచితకా వారు కాదు. ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి వారు. ఇప్పటివరకు ఇలాంటి టాక్ షోలకు దూరంగా ఉన్న వారు సైతం బాలయ్య షోకి ఓకే చెబుతున్నారు.
ఒక్కసారిగా ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2 సీజనులో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ మొదటి భాగాన్ని డిసెంబరు 30న విడుదల చేయగా ఆ ఎపిసోడ్‌కు యాప్ కూడా క్రాష్ అయ్యింది. దీన్ని బట్టి దానికి ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం అవుతుంది. ఇక జనవరి 6న ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం విడుదల కానుంది. ఇదిలా ఉండగా జనవరి అన్ స్టాపబుల్ క్యాలెండర్‌ను ఆహా మీడియా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి సందర్భంగా వీరసింహారెడ్డి టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక దాని తర్వాత అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుంది. జనవరి 26వ తారీకున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కు సంబంధించిన మరో సమాచారం బయటకు వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఈ షోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదటి ఎపిసోడ్లో ఏకంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అందరూ కాబోయే సీఎం గా భావిస్తున్న నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కూడా ఎపిసోడ్ పూర్తి చేశారు. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి, కాబోయే సీఎంగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ కూడా ఈ షోకు వచ్చి బాలయ్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్‌తో కలిసి కేటీఆర్ ఈ షోకి హాజరు కానున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే మాత్రం.. రేటింగ్స్‌కి పిచ్చెక్కిపోవడం ఖాయం. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఈ వార్తలని ఒట్టి పుకార్లు అనుకోవడానికి కూడా వీలు లేదని ఆహా వీక్షకులు భావిస్తుండటం విశేషం.