Viral Video | స్కూటీని వెంబ‌డించిన వీధి కుక్క‌లు.. గాల్లో ఎగిరిప‌డ్డ మ‌హిళ‌లు, బాలుడు

Viral Video | విధాత‌: గ‌త కొంత‌కాలం నుంచి వీధి కుక్క‌ల బెడ‌ద ఎక్కువైపోయింది. వీధి కుక్క‌ల దాడుల్లో ప‌లువురు చిన్నారులు, వృద్ధులు మృతి చెందిన ఘ‌ట‌న‌ల‌ను చూస్తూనే ఉన్నాం. కుక్క క‌నిపించిందంటే చాలు.. అటు వైపు వెళ్లేందుకు జ‌నం జంకుతున్నారు. ఆ రేంజ్‌లో కుక్క‌ల దాడులు ఉన్నాయి. తాజాగా ఓ ఐదు వీధి కుక్క‌లు స్కూటీని వెంబ‌డించాయి. స్కూటీపై వెళ్తున్న బాలుడి స‌హా ఇద్ద‌రు మ‌హిళ‌లు గాల్లో ఎగిరిపడ్డారు. View this post on […]

Viral Video | స్కూటీని వెంబ‌డించిన వీధి కుక్క‌లు.. గాల్లో ఎగిరిప‌డ్డ మ‌హిళ‌లు, బాలుడు

Viral Video |

విధాత‌: గ‌త కొంత‌కాలం నుంచి వీధి కుక్క‌ల బెడ‌ద ఎక్కువైపోయింది. వీధి కుక్క‌ల దాడుల్లో ప‌లువురు చిన్నారులు, వృద్ధులు మృతి చెందిన ఘ‌ట‌న‌ల‌ను చూస్తూనే ఉన్నాం. కుక్క క‌నిపించిందంటే చాలు.. అటు వైపు వెళ్లేందుకు జ‌నం జంకుతున్నారు. ఆ రేంజ్‌లో కుక్క‌ల దాడులు ఉన్నాయి. తాజాగా ఓ ఐదు వీధి కుక్క‌లు స్కూటీని వెంబ‌డించాయి. స్కూటీపై వెళ్తున్న బాలుడి స‌హా ఇద్ద‌రు మ‌హిళ‌లు గాల్లో ఎగిరిపడ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బెర్హంపూర్ సిటీలో ఓ ఇద్ద‌రు మ‌హిళ‌లు, బాలుడు క‌లిసి స్కూటీపై బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్య‌లో ఆ స్కూటీని ఓ ఐదు వీధి కుక్క‌లు వెంబ‌డించాయి. దీంతో కుక్క‌ల దాడి నుంచి త‌ప్పించుకునేందుకు స్కూటీ వేగాన్ని పెంచింది మ‌హిళ‌. ఈ క్ర‌మంలో అదుపుత‌ప్పిన స్కూటీ.. రోడ్డుపై నిల్చున్న కారును ఢీకొట్టింది.

దీంతో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు గాల్లో ఎగిరిప‌డ్డారు. అంద‌రూ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. బాలుడు స్కూల్ డ్రెస్ ధ‌రించి ఉన్నాడు. అయితే ఓ కుక్క స్కూటీ కింద ప‌డింది. అనంత‌రం లేచి మ‌ళ్లీ ప‌రుగెత్తింది. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీధి కుక్క‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.