Chiranjeevi | నిప్పు రాజేసిన చిరు వ్యాఖ్యలు.. YCP నుంచి ఎదురుదాడి

Chiranjeevi | విధాత‌: సాధారణంగా కాస్త సౌమ్యంగా ఉండే మెగాస్టార్ ఎందుకు చేశారో. ? ఏమి ఆశించి చేశారో .. లోపల రగులుతున్న అసంతృప్తితో చేశారో తెలీదు కానీ అన్యాపదేశంగా జగన్ ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ చేసారు. అవిప్పుడు రాజకీయంగా నిప్పు రాజేశాయి. చిరు ఒక్క మాట అంటే ఇక ఇటునుంచి వైసిపి సోషల్ మీడియాతోబాటు ఎమ్మెల్యేలు సైతం ఎదురుదాడి మొదలు పెట్టాయి. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో చిరంజీవి ఏమన్నారంటే .. […]

  • By: Somu    latest    Aug 08, 2023 10:26 AM IST
Chiranjeevi | నిప్పు రాజేసిన చిరు వ్యాఖ్యలు.. YCP నుంచి ఎదురుదాడి

Chiranjeevi |

విధాత‌: సాధారణంగా కాస్త సౌమ్యంగా ఉండే మెగాస్టార్ ఎందుకు చేశారో. ? ఏమి ఆశించి చేశారో .. లోపల రగులుతున్న అసంతృప్తితో చేశారో తెలీదు కానీ అన్యాపదేశంగా జగన్ ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ చేసారు. అవిప్పుడు రాజకీయంగా నిప్పు రాజేశాయి. చిరు ఒక్క మాట అంటే ఇక ఇటునుంచి వైసిపి సోషల్ మీడియాతోబాటు ఎమ్మెల్యేలు సైతం ఎదురుదాడి మొదలు పెట్టాయి.

వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో చిరంజీవి ఏమన్నారంటే .. ‘యాక్టర్ల రెమ్యూనిషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయ‌లన్నారు. అంటే ఇవన్నీ నేరుగా జగన్ను ఉద్దేశించి అన్నట్లుగా అర్థం అవుతోంది.

అంటే అయన రెమ్యునరేషన్ గురించి.. కలెక్షన్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవద్దని అంటున్నట్లు ఉంది. మరి అలాంటపుడు టికెట్ రేట్స్ పెంచాలని ప్రభుత్వాలను ఎందుకు అడగడం ? సినిమాలకు సబ్సిడీలు ఇవ్వాలని, మొదటి వారం టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాలను ఎందుకు అడగడం అనే ప్రశ్నలు ఇటు వైసిపి సైడు నుంచి వస్తున్నాయి.

అసలు చిరు ఉద్దేశ్యం ఏమిటి ? తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తారా ? ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేస్తారా ? లేక తెరవెనుక మాట సాయం చేస్తారా అన్నది తెలియడం లేదు. మరోవైపు హైపర్ ఆది సైతం మెగా బ్రదర్స్ ను ఆకాశానికి ఎత్తుతూ చేసిన ప్రసంగం కాస్త అధిక ప్రసంగం అయినప్పటికీ చిరు ఫ్యాన్స్ కు మాత్రం వీనులవిందుగా ఉంది.

ఈ నేపథ్యంలో చిరు చేసిన కామెంట్స్ మరింత వేడి పుట్టించాయి. అయితే దీనికి ఇప్పటికే కొడాలి నాని రిప్లై ఇస్తూ సినిమాల గురించి నాయకులు అక్కర్లేదు అనుకున్నపుడు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల గురించి మీరెందుకు మాట్లాడాలి… డాన్సులు.. పాటలు చేసుకుంటూ ఉండాలి. కదా ప్రతి పకోడీగాడూ రాజకీయాలు మాట్లాడితే ఎలా ?’అంటూ ఎదురుదాడి మొదలు పెట్టారు. దీంతో చిరు వ్యాఖ్యలు మొత్తానికి రాజకీయాల్లో కాస్త సంచలనానికి కారణం అయ్యాయి.