Chiranjeevi | చిరు ధరించిన.. వాచ్ ఖరీదు తెలిస్తే ఫీజులెగరాల్సిందే..!
Chiranjeevi స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. ఏడు పదుల వయస్సుకి దగ్గరగా వస్తున్న చిరు ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేసి అభిమానులకి మంచి వినోదాన్ని పంచుతున్నాడు. మరోవైపు చిన్న హీరోలని కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ నేడు థియేటర్స్ లో సందడి చేస్తుంది. వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ తర్వాత చిరంజీవి చేసిన సినిమా భోళా శంకర్ కాగా, ఈ […]

Chiranjeevi
స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. ఏడు పదుల వయస్సుకి దగ్గరగా వస్తున్న చిరు ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేసి అభిమానులకి మంచి వినోదాన్ని పంచుతున్నాడు. మరోవైపు చిన్న హీరోలని కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ నేడు థియేటర్స్ లో సందడి చేస్తుంది.
వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ తర్వాత చిరంజీవి చేసిన సినిమా భోళా శంకర్ కాగా, ఈ సినిమాని ప్రేక్షకులని బాగానే ఆదరిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రీసెంట్‌గా 200 రోజులు పూర్తి చేసుకోగా, ఓ హోటల్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి, రవితేజతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈవెంట్‌లో చిరంజీవి పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కార్టియర్ టార్ట్యూ బ్రౌన్ లెదర్ వాచ్ చిరంజీవి తన చేతికి పెట్టుకోగా, ఆ వాచ్ ధర తెలిసి బొమ్మ కనపడింది. చిరు పెట్టుకున్న వాచ్ ధర సుమారు రూ. 34 లక్షలు ఉంటుందని తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
ఇక బేబీ సక్సెస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన చిరంజీవి ఆ సమయంలో మరో వాచ్ పెట్టుకొని వచ్చారు. అది రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్ కాగా, దీని ధర 2,30,000 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం 1.90 కోట్ల రూపాయలు అని తెలిసింది. ఆ వాచ్ కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంది. చిరంజీవి రేంజ్‌కి ఆ మాత్రం వాచ్ వాడకపోతే ఎట్లా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
సాధారణంగా మెగాస్టార్ వాచ్ కలెక్షన్స్ చాలా బాగుంటుంది. ఆయన వాడే కార్స్ కూడా చాలా రిచ్‌గా, అందంగా ఉంటాయి.చిరంజీవి వాడే మరో వాచ్ ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్ కాగా, అది లాంగే కంపెనీకి చెందింది. దీని ధర దాదాపు రూ.33 లక్షలపైనే ఉంటుంది.
చిరంజీవి వాచీలతో సామాన్యులు అయితే లైఫ్ టైమ్ హ్యాపీగా బతికేయోచ్చని.. కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో చిరంజీవి చిరు మాత్రమే కాదు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు పలవురు సెలబ్రెటీలు కూడా ఎక్కువ ఖరీదు ఉన్న వాచీలని వాడుతుంటారు