వరంగల్: నడి రోడ్డుపై సర్కస్‌ ఫీట్లు.. యువకుల అరెస్టు

భీమారం మెయిన్ రోడ్డుపై బైక్ తో సర్కస్ ఫీట్లు అరెస్టు చేసిన పోలీసులు విధాత, వరంగల్: వరంగల్, కరీంనగర్ హైవే మీద హన్మకొండ భీమారం మెయిన్ రోడ్డుపై బైక్ తో శనివారం సర్కస్ ఫీట్లు చేసిన ముగ్గురు యువకులకు అరదండాలు తప్పలేదు. ముగ్గురు యువకులు మోటారు సైకిల్ పై హంగామా చేశారు. వీరి ఫీట్లతో రోడ్డు మీద వెళ్లేవారు ఆందోళనకు గురయ్యారు. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ సర్కస్‌ ఫీట్ల‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […]

  • By: krs    latest    Dec 10, 2022 11:15 AM IST
వరంగల్: నడి రోడ్డుపై సర్కస్‌ ఫీట్లు.. యువకుల అరెస్టు
  • భీమారం మెయిన్ రోడ్డుపై బైక్ తో సర్కస్ ఫీట్లు
  • అరెస్టు చేసిన పోలీసులు

విధాత, వరంగల్: వరంగల్, కరీంనగర్ హైవే మీద హన్మకొండ భీమారం మెయిన్ రోడ్డుపై బైక్ తో శనివారం సర్కస్ ఫీట్లు చేసిన ముగ్గురు యువకులకు అరదండాలు తప్పలేదు.

ముగ్గురు యువకులు మోటారు సైకిల్ పై హంగామా చేశారు. వీరి ఫీట్లతో రోడ్డు మీద వెళ్లేవారు ఆందోళనకు గురయ్యారు. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ సర్కస్‌ ఫీట్ల‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో డేంజరస్ డ్రైవింగ్ వీడియోగా వైరలైంది.

ఈ వీడియో వ‌రంగల్ సీపీ దృష్టికి వెళ్లడంతో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కేయు పోలీసులను ఆదేశించడంతో బండి నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. సర్కస్‌ ఫీట్లు చేసిన బండి బాబులు సుర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజును కేయు పోలీసులు అరెస్టు చేశారు.