Bhatti Vikramarka | స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | కేతపల్లి పాదయాత్ర శిబిరంలో చికిత్స అందించిన వైద్యులు వడదెబ్బ కారణంగా జ్వరంతో బాధ పడుతున్న భట్టి విక్రమార్క విధాత : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి హుటాహుటిన వైద్యులు వచ్చి నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా హైఫీవర్ రావడంతో ఈరోజు సాయంత్రం జరుగాల్సిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. సీఎల్పీ నేత […]

Bhatti Vikramarka |
- కేతపల్లి పాదయాత్ర శిబిరంలో చికిత్స అందించిన వైద్యులు
- వడదెబ్బ కారణంగా జ్వరంతో బాధ పడుతున్న భట్టి విక్రమార్క
విధాత : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి హుటాహుటిన వైద్యులు వచ్చి నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
వడదెబ్బ కారణంగా హైఫీవర్ రావడంతో ఈరోజు సాయంత్రం జరుగాల్సిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి 96 రోజులు కావస్తున్నది. గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులు ఉన్నాయని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే.
కాగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్న సంకల్పంతో భగ భగ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పాదయాత్ర చేయడం వల్ల సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఖమ్మం నుంచి హుటాహుటిన ఆయన సతీమణి నందిని మల్లు కేతపల్లికి చేరుకుని దగ్గరుండి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు.
పలువురు ప్రముఖుల పరామర్శ
భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, వడ్డే నారాయణరావు, రాందాస్ నాయక్, బాలాజీ నాయక్, డాక్టర్ రవి, పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.