CM Jagan | బడుద్ధాయిలు.. నలుగురు పెళ్ళాలు: స్పీచ్ తీరు మార్చిన సీఎం జగన్

విధాత‌: బటన్ నొక్కడం అని మన ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నారు… అసలు బటన్ నొక్కడం అంటే ఏమిటో ఈ బడుద్ధాయిలకు తెలుసా అని సీఎం వైయస్ జగన్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మఒడి పథకం కింద స్కూలు పిల్లలకు రూ. 15 000 చొప్పున జమచేసి కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్షాల మీద విమర్శల దాడి చేశారు. తాను బటన్ నొక్కి ఎలాంటి వివక్షకు, రికమెండేషన్లు, పైరవీలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు […]

  • Publish Date - June 28, 2023 / 01:33 PM IST

విధాత‌: బటన్ నొక్కడం అని మన ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నారు… అసలు బటన్ నొక్కడం అంటే ఏమిటో ఈ బడుద్ధాయిలకు తెలుసా అని సీఎం వైయస్ జగన్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మఒడి పథకం కింద స్కూలు పిల్లలకు రూ. 15 000 చొప్పున జమచేసి కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్షాల మీద విమర్శల దాడి చేశారు.

తాను బటన్ నొక్కి ఎలాంటి వివక్షకు, రికమెండేషన్లు, పైరవీలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నానని ఇది తెలుసుకోలేని బడుద్ధాయిలు ఏవేవో మాట్లాడుతుంటారని అయన విమర్శలు చేశారు.

గాంధీ గారి మూడు కోతుల మాదిరిగానే ఆంధ్రాలో నాలుగు కోతులు ఉన్నాయని అవి మంచిని చూడలేవని, మంచిని మాట్లాడలేవని, మంచిని చేయలేవని, మంచిని చెప్పలేవని అంటూ ఆ నాలుగు కోతులను విపక్షాలతో బాటు ఎల్లోమీడియాను కలిపి ఒకేగాటన కట్టారు.

ఇంకా పవన్ గురించి మాట్లాడుతూ.. ఒక దత్త పుత్రుడు ఒక లారీలో తిరుగుతూ ఊగిపోతూ నాయకులను కొడతానని, తంతానని, సంకెళ్లు వేస్తాను అని చెబుతుండడం గమనించానని, తాను ఆలా మాట్లాడలేనని, తనకు ఒక పద్ధతిగా మాట్లాడడమే వచ్చని అన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడే పేటెంట్ పవన్ కు మాత్రమే ఉందని అన్నారు. తనకు ఇంకా తనకు నాలుగేళ్లకు ఒక భార్యను వదిలివేయడం రాదనీ, తనకు కుటుంబ విలువలు తెలుసనీ అన్నారు. ఇక టిడిపి , పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడుతూ వారిది అధికారం కోసం పాకులాడడం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేద్యం లేదని ఆరోపించారు.