CM Jagan | రాజకీయ పదవుల్లో.. గిరిజనులకు ప్రాధాన్యత: సీఎం జగన్
CM Jagan | విధాత: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజకీయ పదవుల్లో గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరిగిన గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. గిరిజన శాసనసభ్యులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను కలుపుతూ […]

CM Jagan |
విధాత: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజకీయ పదవుల్లో గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరిగిన గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. గిరిజన శాసనసభ్యులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను కలుపుతూ గిరిజనులకు ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఏర్పాటు చేశామని అన్నారు.
గిరిజన ప్రాంతాలలోని 497 సచివాలయాల్లో గిరిజనులనే వలంటీర్లుగా నియమించామని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చేయవలసినవి అన్నీ చేస్తున్నట్లు వివరించారు