CM KCR | నా ఉక్కు సంక‌ల్పాన్ని ఏనాడూ విస్మ‌రించ‌లేదు : సీఎం కేసీఆర్

CM KCR | తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలను స‌చివాల‌యం వేదిక‌గా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జ‌రిగింది. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నాటి ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. 1969లో ఎగిసిప‌డిన తెలంగాణ ఉద్య‌మం ర‌క్త‌సిక్త‌మైంది. దారుణ‌మైన అణ‌చివేత‌కు గురైంది. 1971లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక తెలంగాణ డిమాండ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జాతీర్పు వెలువ‌డిన‌ప్ప‌టికీ నాటి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించ‌లేదు. 2001 […]

CM KCR | నా ఉక్కు సంక‌ల్పాన్ని ఏనాడూ విస్మ‌రించ‌లేదు : సీఎం కేసీఆర్

CM KCR | తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలను స‌చివాల‌యం వేదిక‌గా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జ‌రిగింది.

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నాటి ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. 1969లో ఎగిసిప‌డిన తెలంగాణ ఉద్య‌మం ర‌క్త‌సిక్త‌మైంది. దారుణ‌మైన అణ‌చివేత‌కు గురైంది. 1971లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక తెలంగాణ డిమాండ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జాతీర్పు వెలువ‌డిన‌ప్ప‌టికీ నాటి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించ‌లేదు.

2001 వ‌ర‌కు తెలంగాణ‌లో నిర్వేదం నెల‌కొంది. 2001లో ఉద్య‌మం మ‌రోసారి ఎగిసిప‌డింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో అహింసాయుతంగా, వివేకం పునాదిగా మ‌లిద‌శ ఉద్య‌మం జ‌రిగింది. విద్యావంతులు, మేధావులు, క‌వులు, క‌ళాకారులు, విద్యార్థులు, మ‌హిళ‌లు ఉద్య‌మంలో పాల్గొని ముందుకు క‌దిలారు. వారంద‌రి భాగ‌స్వామ్యంతో ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది. రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా వారంద‌రికీ త‌ల‌వంచి న‌మ‌స్క‌రిస్తున్నారు. త్యాగ‌ధ‌నులైన అమ‌రుకు హృద‌య‌పూర్వ‌కంగా నివాళులు అని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అమ‌రుల ఆశ‌యాల‌ను, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అంకిత‌మైంది. దేశం నివ్వెర‌పోయే ఫ‌లితాల‌ను సాధించింది. ప్ర‌తి రంగంలో ప్ర‌గ‌తి ప‌రుగులు పెడుతోంది. తొమ్మిదేండ్లు అద్భుత‌మైన పాల‌న సాగించి.. ప‌దో వ‌సంతంలో అడుగుపెట్ట‌డం ఒక మైలురాయి. అత్యంత ఘ‌నంగా ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాం.

గ్రామ స్థాయి నుంచి రాజ‌ధాని న‌గ‌రం వ‌ర‌కు జ‌రుగుతున్నాయి. అంద‌రూ ఉత్సాహంగా పాల్గొనాల‌ని కోరుతున్నాను. దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్ర‌గ‌తిని ద‌శ‌దిశలా చాటుదాం. తెల‌గాణ స‌మాజం నాలుగు ద‌శాబ్దాల పాటు అలుపెర‌గ‌ని పోరాటం చేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.

ప్ర‌జ‌ల ఆశ‌యం జ‌యించి 2014, జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు ఏ రంగంలో చూసి నా విధ్వంస‌మే. అవ‌రోధాల‌ను అధిగ‌మించి, బ‌లీయ‌మైన ఆర్థిక శ‌క్తిగా ఎదిగింది. స‌మాజాన్ని అభివృద్ధి ప‌థంలోకి తీసుకెళ్లాం. తెలంగాణ‌ను పున‌ర్ నిర్మించుకున్నాం. నూత‌న విధానాల‌కు రూప‌క‌ల్ప‌న చేసింది. వివిధ చ‌ట్టాలు, ప్ర‌ణాళిక‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించుకున్నాం.

రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే విధంగా భార‌త‌దేశానికే త‌ల‌మానికంగా ఉండే విధంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతాన‌ని హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంక‌ల్పాన్ని ఏనాడూ విస్మ‌రించ‌లేదు. 9 ఏండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో విజ‌యం సాధించాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.