మంత్రులు, ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఏం చెప్పారంటే..
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి, ఆయా సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ నాయకత్వంతో స్పందించినట్లు సమాచారం

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి, ఆయా సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ నాయకత్వంతో స్పందించినట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్‌లో పరేషాన్ కావొద్దని, మళ్లీ బీఆర్ఎస్సే అధికారం చేపట్టబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను శుక్రవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిసి, ఎగ్జిట్ పోల్స్‌తో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాలపై జరగుతున్న ప్రచారంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రాన్ని పాలించబోయేది బీఆర్ఎస్ అని వారితో కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఇవాళ, రేపు ఓపిక పడితే, 3వ తేదీన సంబురాలు చేసుకుందామని పార్టీ నాయకులతో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేసిన సీఎం.. ఆగం కావొద్దు.. ధైర్యంగా ఉండాలని నాయకులకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం