TSRTC | ఆర్టీసీ కార్మికుల‌కు గుడ్ న్యూస్.. ప్ర‌భుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం

TSRTC | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ కార్మికుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. మంత్రి వ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం కేటీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దీనికి సంబంధించిన బిల్లును ఆగ‌స్టు […]

TSRTC | ఆర్టీసీ కార్మికుల‌కు గుడ్ న్యూస్.. ప్ర‌భుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం

TSRTC | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ కార్మికుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు.

మంత్రి వ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం కేటీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. దీనికి సంబంధించిన బిల్లును ఆగ‌స్టు 3న ప్రారంభం కాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మార‌నున్నారు. దీంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మార‌నున్నారు.

ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు విధివిధానాలు రూపొందించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించిన‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. దీని కోసం స‌బ్ క‌మిటీని నియ‌మిస్తామ‌న్నారు. స‌బ్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొన‌సాగ‌నున్నారు.