CM KCR వైపే యావత్ దేశం చూపు: మంత్రి జగదీష్ రెడ్డి
పేటలో కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌లోకి వలసలు BRS గూటికి కాంగ్రెస్ కౌన్సిలర్ మడిపెళ్లి విక్రమ్ విధాత: బిఆర్ఎస్ ఏర్పాటు ప్రకటనతో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబడతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీయే దేశ దశ దిశలను నిర్దేశిస్తుందన్న నమ్మకం దేశ ప్రజల్లో ప్రభలంగా ఏర్పడిందన్నారు. అందుకే కాబోలు దేశం నలుమూలల నుంచి బీఆర్ఎస్లో చేరికలకు బారులు తీరుతున్నారన్నారు. ఆదివారం రోజున సూర్యాపేట పురపాలక సంఘం […]

- పేటలో కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌లోకి వలసలు
- BRS గూటికి కాంగ్రెస్ కౌన్సిలర్ మడిపెళ్లి విక్రమ్
విధాత: బిఆర్ఎస్ ఏర్పాటు ప్రకటనతో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబడతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీయే దేశ దశ దిశలను నిర్దేశిస్తుందన్న నమ్మకం దేశ ప్రజల్లో ప్రభలంగా ఏర్పడిందన్నారు. అందుకే కాబోలు దేశం నలుమూలల నుంచి బీఆర్ఎస్లో చేరికలకు బారులు తీరుతున్నారన్నారు.
ఆదివారం రోజున సూర్యాపేట పురపాలక సంఘం కౌన్సిలర్ కాంగ్రెస్ నేత మడిపల్లి విక్రమ్‌తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 450 పై చిలుకు కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ లీడర్ బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశ భవిష్యత్‌ను కళ్లెదుటే ఆవిష్కరించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ దేశ సహజ వనరుల వినియోగం, రైతాంగానికి బాసటగా రూపొందించిన విజన్‌తో విపక్షాలు గందరగోళంలోకి నెట్టి వెయ్యబడ్డాయన్నారు. నాడు టీఆర్ఎస్ ఏర్పాటుతో రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బిఆర్ఎస్ ఏర్పాటుతో దేశాభివృద్ధికి రూట్ మ్యాప్ రూపొందించారన్నారు. కేసీఆర్ విధానాలపై నమ్మకంతో యావత్ భారత దేశం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.