తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి
తిరుమల శ్రీవారిని సీఎం కేసీఆర్ సతీమణి శోభారావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు

విధాత : తిరుమల శ్రీవారిని సీఎం కేసీఆర్ సతీమణి శోభారావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో శోభారావుకు వేద ఆశీర్వచనం అందచేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఆమె వెంట చంద్రగిరి ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. అటు శ్రీకాళహస్తికి కూడా వెళ్లిన శోభారావు, ఆమె కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పవిత్రరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందచేశారు.