సీఎం నితీశ్‌కు వృద్ధాప్యంతో మ‌తి భ్ర‌మించింది: ప్ర‌శాంత్ కిషోర్‌

విధాత: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ల మ‌ధ్య మాట‌ల వార్ న‌డుస్తున్న‌ది. నితీశ్ కుమార్‌లో వ‌య‌సు ప్ర‌భావం క‌నిపిస్తున్న‌ద‌ని, ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తుంటే.. ఒకటి చెప్పాల‌నుకుని మ‌రొక‌టి చెప్తున్నార‌ని ప్ర‌శాంత్‌కిషోర్ ఎద్దేవా చేశారు. తాను బీజేపీ కోసం ప‌నిచేస్తున్న‌ట్లు పేర్కొన్న నితీశ్‌కుమారే తాను జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాల‌ని కోరిన‌ట్టు చెప్పాన‌ని ఆ రెండు అంశాల‌కు పొంత‌న కుద‌ర‌ద‌న్నారు. తాను బీజేపీ కోసం ప‌నిచేస్తుంటే కాంగ్రెస్ బ‌లోపేతం ఎందుకు కోరుతాన‌ని పీకే ప్ర‌శ్నించారు. […]

  • By: krs    latest    Oct 09, 2022 5:24 PM IST
సీఎం నితీశ్‌కు వృద్ధాప్యంతో మ‌తి భ్ర‌మించింది: ప్ర‌శాంత్ కిషోర్‌

విధాత: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ల మ‌ధ్య మాట‌ల వార్ న‌డుస్తున్న‌ది. నితీశ్ కుమార్‌లో వ‌య‌సు ప్ర‌భావం క‌నిపిస్తున్న‌ద‌ని, ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తుంటే.. ఒకటి చెప్పాల‌నుకుని మ‌రొక‌టి చెప్తున్నార‌ని ప్ర‌శాంత్‌కిషోర్ ఎద్దేవా చేశారు.

తాను బీజేపీ కోసం ప‌నిచేస్తున్న‌ట్లు పేర్కొన్న నితీశ్‌కుమారే తాను జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాల‌ని కోరిన‌ట్టు చెప్పాన‌ని ఆ రెండు అంశాల‌కు పొంత‌న కుద‌ర‌ద‌న్నారు. తాను బీజేపీ కోసం ప‌నిచేస్తుంటే కాంగ్రెస్ బ‌లోపేతం ఎందుకు కోరుతాన‌ని పీకే ప్ర‌శ్నించారు.

నితీశ్ వృద్ధాప్య ఛాయ‌ల‌తో మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నారు. రాజ‌కీయంగా ఏకాకిగా మారాన‌ని ఆందోళ‌న కూడా ఆయ‌న మాట‌ల్లో క‌నిపిస్తున్న‌ద‌న్నారు. ఎవ‌రిపైన ఆయ‌న‌కు న‌మ్మకం లేదో వారిపైనే ఆయ‌న ఆధార‌ప‌డాల్సి వ‌స్తున్న‌ద‌ని పీకే పేర్కొన్నారు.