2034 వరకు కాంగ్రెస్ పాలనే

కేసీ­ఆర్‌ అనే దుర్మా­ర్గుడి పదేళ్ల పాల­నలో తెలం­గాణ రాష్ట్రo అన్ని రంగాల్లో సర్వ­నా­శనం అయిం­దని ముఖ్య­మంత్రి, టీపీ­సీసీ చీఫ్‌ రేవం­త్‌­రెడ్డి మండి­ప­డ్డారు

2034 వరకు కాంగ్రెస్ పాలనే
  • తెలం­గాణ అభి­వృద్ధి కోసం మోదీ­తో­నైనా, కేడీ­తో­నైనా పోరా­టమే!
  • అన్యాయం చేస్తే చాకి­రేవు పెట్టి ఉతికి ఆరేస్తా
  • వారి­ద్దరి పదేళ్ల పాల­నలో తెలం­గాణ విధ్వంసం
  • మాజీ సీఎం కేసీ­ఆర్‌ చేతిలో ఆగ­మైన తెలం­గాణ
  • మోదీకి విన­తి­ప­త్రం ఇస్తే బీఆ­రెస్ తప్పుడు ప్రచారం
  • అతి­థు­లకు మర్యాద ఇవ్వడం మన సంస్కృతి
  • కాంగ్రెస్ పాల­నలో ప్రజలు సంతృ­ప్తిగా ఉన్నారు
  • బీఆ­రెస్ కాదు అది.. బిల్లా రంగా సమితి
  • చేపల పులు­సుకు ఆశ­పడి కృష్ణా జలా­లను
  • రాయ­ల­సీ­మకు తాకట్టు పెట్టిన కేసీ­ఆర్‌
  • మహ­బూ­బ్‌­న­గర్‌ సభలో సీఎం రేవం­త్‌­రెడ్డి
  • ఎన్ని­కల ప్రచారం ప్రారం­భిం­చిన పీసీసీ చీఫ్‌


విధాత, ఉమ్మడి మహ­బూబ్ నగర్ జిల్లా ప్రతి­నిధి: కేసీ­ఆర్‌ అనే దుర్మా­ర్గుడి పదేళ్ల పాల­నలో తెలం­గాణ రాష్ట్రo అన్ని రంగాల్లో సర్వ­నా­శనం అయిం­దని ముఖ్య­మంత్రి, టీపీ­సీసీ చీఫ్‌ రేవం­త్‌­రెడ్డి మండి­ప­డ్డారు. తెలం­గాణ అభి­వృద్ధి కోసం మోదీతో అయినా కేసీ­ఆర్‌ లాంటి కేడీ­తో­నైనా పోరాటం చేస్తా­నని స్పష్టం చేశారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేడీ, మోదీ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘కేసీఆర్.. విను.. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుంది. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం ఉంటది.. పేదలకు అండగా ఉంటది. నాకు వయసుంది.. ఓపిక ఉంది. ఎవరైనా అటూ ఇటూ చేస్తే తోక కత్తిరించేందుకు కత్తెర నా జేబులో ఉంది’ అన్నారు.


బుధ­వారం పాల­మూరు జిల్లా కేంద్రంలో నిర్వ­హిం­చిన ప్రజా దీవెన పేరుతో నిర్వహించిన ఎన్నికల సభలో బీజేపీ, బీఆ­రె­స్‌పై రేవం­త్‌­రెడ్డి విరు­చుకు పడ్డారు. పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ విధ్వంసం చేస్తే.. ఒక్కొక్క శకలాన్ని తొలగించి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే మొదలు పెట్టామన్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌ గెలవాలి.. రాహుల్‌గాంధీ దేశానికి ప్రధాని కావాలి.. అన్నారు. తాగితే ఒకటి, దిగితే ఇంకోటి మాట్లాడటానికి తాను కేసీఆర్‌ను కాదు.. నేను మీ రేవంతన్ననని చెప్పారు.


కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సం­బం­ధాలు అవ­సరం


పాలమూరుకు, తుమ్మిడిహెట్టికి, మూసీ అభివృద్ధి, మెట్రోకు నిధులు ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతలకు జాతీయ హోదా ఇవ్వాలని మోదీని అడిగానని రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ.. బీఆ­రెస్ సన్నా­సులు తాను మోదీని పొగి­డా­న­నిని అంటు­న్నా­రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి­థులు వస్తే మర్యాద ఇవ్వడం తెలం­గాణ సంస్కృతి అనే విషయం కూడా తెలి­యని సన్నా­సులే విమ­ర్శలు చేస్తు­న్నా­రని అన్నారు. ‘తెలం­గాణ రాష్ట్ర అభి­వృద్ధి కోసం మోదీతో మాట్లాడా. సీఎంగా బాధ్య­తగా వ్యవ­హ­రించా. ఇది కూడా తెలి­యని బీఆ­రెస్ నాయ­కులు ఓర్వ­లేక నాపై విమ­ర్శలు చేస్తే తెలం­గాణ సమాజం ఊరు­కోదు’ అన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభు­త్వాల మధ్య మంచి సంబం­ధాలు ఉంటేనే రాష్ట్రంలో అభి­వృద్ధి జరు­గు­తుం­దని రేవంత్ రెడ్డి పేర్కొ­న్నారు. తెలం­గా­ణకు మోదీ, కేడీ.. ఎవరు అన్యాయం చేసినా చాకి­రేవు పెట్టి, ఉతికి ఆరే­స్తా­న­న్నారు. తమ మంచి­త­నాన్ని చేత­కా­ని­తనం అను­కుంటే పొర­పా­టే­నని చెప్పారు. తానేమీ ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి, కడుపులో తలకాయ పెట్టి కాళ్లు పట్టుకోలేదని, చెవిలో గుస గుసలు చెప్పలేదని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. మనం అడిగిన సమస్యలు తీర్చకపోయినా.. మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాక ఉతికే బాధ్యత నేను తీసుకుంటానని ప్రకటించారు.


పాలమూరు బిడ్డను సీఎంగా ఓర్వలేక పోతున్నారు


బీజేపీ, బీఆ­రెస్ నేతలు మాటి­మా­టికీ రాష్ట్రoలో కాంగ్రెస్ ప్రభుత్వం పడి­పో­తుం­దని అంటు­న్నా­రన్న రేవం­త్‌­రెడ్డి.. ఒక పాల­మూరు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చో­వడం ఆ రెండు పార్టీ­లకూ ఇష్టం లేదని అన్నారు. ప్రభుత్వం పడి­పో­తుం­దని మరో­సారి అంటే పాల­మూరు పౌరులు అగ్గి కణి­కలై వారికి బుద్ధి చెబు­తా­రని హెచ్చ­రిం­చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆ­రెస్‌ పదేళ్లు సాగిం­చిన పాల­న­లోనే తెలం­గాణ రాష్ట్రo విధ్వం­సా­నికి గురైం­దని రేవం­త్‌­రెడ్డి చెప్పారు. ‘కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండొచ్చు.. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండచ్చు.. కానీ పేదోళ్ల ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆరునెలల్లో పడగొడుతారట. విజ్ఞులు ఆలోచన చేయాలి.. దుర్మార్గ రాజకీయాలను పాతరేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.


చేపల పులుసుకు కృష్ణా జలాలు తాకట్టు


చేపల పులు­సుకు ఆశ­పడి రాయ­ల­సీ­మకు కృష్ణా జాలాలు కేసీ­ఆర్‌ తర­లిం­చా­రని రేవం­త్‌­రెడ్డి ఆరో­పిం­చారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు­కుం­టుంటే తమపై ఎదురు దాడి చేస్తు­న్నా­రని మండి­ప­డ్డారు. ఈ పదే­ళ్లలో మోదీ ప్రభుత్వం పాల­మూరు, రంగా­రెడ్డి ప్రాజె­క్టుకు జాతీయ హోదా ఇవ్వ­లే­దని విమ­ర్శిం­చారు. కేసీ­ఆర్‌ సీఎంగా ఉన్న సమ­యంలో నెట్టెం­పాడు, కోయి­ల్‌­సా­గర్, భీమా లాంటి ప్రాజె­క్టుల నిర్వ­హ­ణను పట్టిం­చు­కో­లే­దని ఆరో­పిం­చారు. పాల­మూరు జిల్లాను ఆగం చేసిన కేసీ­ఆర్‌ లాంటి దుర్మా­ర్గు­డిని ఇంటికి పంపి, పాల­మూరు జిల్లాకు విముక్తి కల్గిం­చిన ఘనత ఇక్కడి ప్రజ­లకు దక్కిం­ద­న్నారు. కేసీ­ఆర్ పాల­నలో అవి­నీతి ఆకా­శా­నికి.. అభి­వృద్ధి పాతా­ళా­నికి వెళ్లా­యని వ్యాఖ్యా­నిం­చారు.


బిల్లా, రంగా సమితి


హరీశ్‌, కేటీఆర్‌ను చూస్తుంటే బీఆరెస్ కాదు.. బిల్లా రంగా సమితిలా కనిపిస్తోందని రేవంత్‌ ఎద్దేవా చేశారు. పదవి పోయి మతి భ్రమించి బీఆరెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని అవహేళన చేశారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే ఆరోగ్యం బాగాలేదని హరీష్ చెబుతుండు. ఆరోగ్యం బాగలేనోడు మరి నల్లగొండ సభకు ఎట్ల పోయిండు?’ అని రేవంత్‌ ప్రశ్నించారు. బీఆరెస్‌తో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్‌.. ‘మొన్నటి వరకు దొరల గడీలను బద్దలు కొడతానాన్న మిత్రుడు ప్రవీణ్ దొర పంచన చేరిండు.. అలాంటి వ్యక్తి మన పాలమూరు గౌరవం నిలబెడతాడా?’ అని ప్రశ్నించారు. పదేళ్లయినా మోదీ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.


మూడు నెలల్లో 30వేల కొలువులు


అధి­కా­రం­లోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యో­గాల భర్తీకి చర్యలు తీసు­కు­న్నా­మని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వచ్చే పార్ల­మెంట్ ఎన్ని­కల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్‌­రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిని ప్రజలు దీవిం­చా­లనికోరారు. ఈ సభలో మంత్రులు కోమ­టి­రెడ్డి వెంక­ట­రెడ్డి, దామో­దర రాజన­ర్సింహ, జూపల్లి కృష్ణా­రావు, డీసీసీ అధ్య­క్షుడు, ఎమ్మెల్యే మధు­సూ­దన్ రెడ్డి, ఎమ్మె­ల్యేలు పర్ణిక, శ్రీహరి, ఎన్నం శ్రీని­వాస్ రెడ్డి, అని­రుధ్‌ రెడ్డి, నారా­యణ రెడ్డి, వంశీ­కృష్ణ, రాజేష్ రెడ్డి, శంకర్, మేఘ రెడ్డి, ఎమ్మెల్సీ దామో­దర్ రెడ్డి, నాయ­కులు ఓబే­దుల్లా కొత్త్వాల్, సరిత తది­త­రులు పాల్గొ­న్నారు.