స్పీకర్‌ ప్రసాద్‌..సీపీఎం నేత తమ్మినేనిలకు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

అనారోగ్యానికి గురై కోలుకుంటున్నశాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలను సీఎం రేవంత్‌ రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు

స్పీకర్‌ ప్రసాద్‌..సీపీఎం నేత తమ్మినేనిలకు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

విధాత : అనారోగ్యానికి గురై కోలుకుంటున్నశాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలను సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం వేర్వేరుగా పరామర్శించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రేవంత్‌ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు