MLA Rekha Naik | సీఎం గారూ నేను BRS ఎమ్మెల్యేనే.. అభివృద్దిని అడ్డుకోకండి: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్
MLA Rekha Naik | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ… టికెట్ల కేటాయింపులో మీరు నన్ను పక్కన బెట్టినా, నేనూ మాత్రం పార్టీని వదిలి ఎక్కడికీ పోలేదు. పార్టీ కోసం పన్నెండు సంవత్సరాలుగా పనిచేశా. నా నియోజవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధి కాకుండా అన్యాయం చేస్తున్నారు.. చూడండి’ అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వారంటూ తన నియోజకవర్గానికి […]

MLA Rekha Naik |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ… టికెట్ల కేటాయింపులో మీరు నన్ను పక్కన బెట్టినా, నేనూ మాత్రం పార్టీని వదిలి ఎక్కడికీ పోలేదు. పార్టీ కోసం పన్నెండు సంవత్సరాలుగా పనిచేశా. నా నియోజవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు.
అభివృద్ధి కాకుండా అన్యాయం చేస్తున్నారు.. చూడండి’ అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వారంటూ తన నియోజకవర్గానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పనిచేయాల్సి ఉందని అన్నారు.
నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారని, తాను మాత్రం పార్టీ మారలేదని అన్నారు. పార్టీ మారింది తన భర్తనే కానీ, తాను కాదని అన్నారు. అలాగైతే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి సీపీఐలో పనిచేయడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేసి అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు.
దళిత బంధు,బీసీ బంధు, మైనార్టీ బంధు నిధులు, రోడ్డు పనులను నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేయడమే కాకుండా తన బిడ్డకు కూడా అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తొమ్మిదేళ్ళుగా నియోజకవర్గం అభివృద్ది కోసం పనిచేశానని, ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు. కొత్తగా ప్రకటించిన అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ కోసం నియోజకవర్గానికి రావాల్సిన నిధులను ఆపడం భావ్యం కాదన్నారు. ఇది మంచి పద్దతి కాదని, ప్రభుత్వ ఈ వైఖరిని మార్చుకోవాలని కోరారు.