Old Mobiles | పాత మొబైళ్ల షాపు: రూ.50 కోట్ల టర్నోవరు.. మూడు బ్రాంచ్‌లు

Old Mobiles | హైదరాబాద్‌లోనూ జో బాక్స్‌ బ్రాంచ్‌ న్యూఢిల్లీ : ఢిల్లీలో బాగా కిక్కిరిసిన ట్రాఫిక్ రద్దీ ఉండే మెట్రో స్టేషన్లలో కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ఒకటి. ఆ మెట్రో స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ ముందుకు పోతే ఒక పెద్ద మొబైల్ స్టోర్ కనబడుతుంది. అదొక మొబైల్ స్టోరే కాదు.. మొబైల్ కంపెనీ కూడా. ఆ కంపెనీ పేరు జో బాక్స్ (JJO BOX). దీని ఫౌండర్ నీరజ్ చోప్రా. మొబైల్ స్టోర్ […]

  • By: Somu    latest    Sep 07, 2023 12:54 PM IST
Old Mobiles | పాత మొబైళ్ల షాపు: రూ.50 కోట్ల టర్నోవరు.. మూడు బ్రాంచ్‌లు

Old Mobiles |

  • హైదరాబాద్‌లోనూ జో బాక్స్‌ బ్రాంచ్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో బాగా కిక్కిరిసిన ట్రాఫిక్ రద్దీ ఉండే మెట్రో స్టేషన్లలో కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ ఒకటి. ఆ మెట్రో స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ ముందుకు పోతే ఒక పెద్ద మొబైల్ స్టోర్ కనబడుతుంది. అదొక మొబైల్ స్టోరే కాదు.. మొబైల్ కంపెనీ కూడా.

ఆ కంపెనీ పేరు జో బాక్స్ (JJO BOX). దీని ఫౌండర్ నీరజ్ చోప్రా. మొబైల్ స్టోర్ లో వందల కొలదీ మొబైళ్లు వేరువేరు కంటైనర్లలో అమర్చి ఉంచారు. ఆ కంటైనర్లతో మొబైల్ షాపు కిక్కిరిసి ఉంటుంది.

మొబైళ్లన్నీ బాగా పేరున్న వేర్వేరు బ్రాండెడ్ కంపెనీలవే. ఎవరైనా ఈ మొబైళ్లను చూస్తే వెంటనే కొనేయాలని అనుకొంటారు. అయితే వాస్తవం ఏమంటే అవి కొత్తవి కాదు.. పాతవి. కానీ కొత్త వాటి కన్నా అవి ఏ మాత్రం తీసిపోవు. ఎవరైనా తమ ఫోన్లకు ఉన్న సమస్యలో, లేదా కొత్త ఫోన్లు వాడాలనే కోరిక వల్లనో పాత ఫోన్లను ఈ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో వాటిని మార్చుకొని కొత్త ఫోన్లను వాడుతుంటారు.

ఈ రీప్లేస్ అయిన పాత ఫోన్లనే జోబాక్స్ కంపెనీ కొని, వాటికి అవసరమైన చిన్నా, పెద్దా రిపేర్ పనులు పూర్తి చేసి, నిశ్చిత సమయ సర్వీసు గ్యారంటీతో మార్కెట్ లోకి దించుతారు. తమకు నచ్చినా.. ఎక్కువ రేటు ఉండటంతో కొనుగోలు చేయలేక పోయిన వారు.. సగం లేదా సగాని కన్నా తక్కువకే దొరికే ఈ బ్రాండెడ్ పాత మొబైళ్లను బాగా ఇష్టపడుతున్నారు.

ఇటువంటి కస్టమర్లను దృష్టిలో పెట్టుకొనే జోబాక్స్ కంపెనీ ఏర్పడింది. భోపాల్, జయపూర్, పాట్నా, లక్నో వంటి 2వ, 3వ, 4వ శ్రేణి పట్టణాల్లో పెద్ద మొత్తంలో ఈ మొబైళ్లను అమ్ముతారు. జోబాక్స్ కంపెనీకి కరోల్ బాగ్, నోయిడాతో పాటు హైదరాబాద్‌లోనూ యూనిట్లు ఉన్నాయి. జోబాక్స్ టర్నోవర్ రూ.50 కోట్లకు మించి ఉంది