SANGAREDDY: ‘నీటి పారుదల’ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష
పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: జిల్లాలో నీటిపారుదలకు సంబంధించిన వివిధ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో చెక్ డ్యాము పనుల పురోగతి, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పంప్ హౌస్ లకు, కొత్త ట్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ, కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్-19 పురోగతి, […]

- పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ
విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: జిల్లాలో నీటిపారుదలకు సంబంధించిన వివిధ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో చెక్ డ్యాము పనుల పురోగతి, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పంప్ హౌస్ లకు, కొత్త ట్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ, కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్-19 పురోగతి, నల్ల వాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనుల పురోగతి పై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాకు మంజూరైన 7 చెక్ డ్యాంలలో రెండు చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తయినవని, మూడింటి పనులు 80 శాతం పూర్తి అయ్యాయని, మిగతా రెండింటి పనులు వివిధ దశలలో ఉన్నట్లు నీటిపారుదల శాఖ ఎస్ ఈ కలెక్టర్ కు వివరించారు. మార్చి 2023 లోగా ఆయా చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేయన్నట్లు తెలిపారు. ఆయా భూసేకరణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని ఎస్ ఈ మురళీధర్ కు సూచించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ఎస్ ఈ మురళీధర్, డిప్యూటీ ఎస్ ఈ రాజేంద్రప్రసాద్, ఈఈలు మధుసూదన్ రెడ్డి, భీమ్, విజయ్ కుమార్, డీఈలు తదితరులు పాల్గొన్నారు.