దసరా వార్: బరిలో పెద్ద హీరోలు.. నడుమ స్వాతిముత్యం

విధాత‌, సినిమా: టాలీవుడ్‌కు నాలుగు మెయిన్ పిల్లర్స్‌గా స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడు చాలా మంది నవతరం హీరోలు వచ్చి మంచి స్టార్‌డమ్‌ తెచ్చుకున్నప్పటికీ సీనియర్లు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వచ్చాయంటే బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ వీళ్ళ సినిమాలే ఉండేవి. చాలాకాలం తర్వాత మళ్లీ అలాంటి పోటీనే ఈ దసరాకు కనిపించనుంది. […]

దసరా వార్: బరిలో పెద్ద హీరోలు.. నడుమ స్వాతిముత్యం

విధాత‌, సినిమా: టాలీవుడ్‌కు నాలుగు మెయిన్ పిల్లర్స్‌గా స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడు చాలా మంది నవతరం హీరోలు వచ్చి మంచి స్టార్‌డమ్‌ తెచ్చుకున్నప్పటికీ సీనియర్లు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు.

ఒకప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వచ్చాయంటే బాక్సాఫీస్ బరిలో నువ్వా నేనా అంటూ వీళ్ళ సినిమాలే ఉండేవి. చాలాకాలం తర్వాత మళ్లీ అలాంటి పోటీనే ఈ దసరాకు కనిపించనుంది.

ఇద్దరు పెద్ద స్టార్ హీరోల సినిమాలు దసరా సందర్భంగా రిలీజ్ అవ్వనున్నాయి. ఇప్పుడు అంతా ఈ రెండు బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల ఆచార్యతో నిరాశ పరచగా ఇప్పుడు మలయాళ సూపర్‌ హిట్ చిత్రం లూసీఫర్‌కి రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’తో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇటీవల విడుదల చేసిన టీజ‌ర్‌తో ఫ్యాన్స్ పండగా చేసుకోగా సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో వాహ్‌ అనేలా ఉన్నారు చిరు. ఈ లుక్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తుండగా.. సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్‌, నయనతార కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అదేవిధంగా మరో సీనియర్‌ స్టార్‌ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ కూడా చిత్రం అక్టోబర్‌ 5న విడుదల కానున్న‌ది. సోనాలి చౌహాన్‌ కథానాయిక కాగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందబోతుంది. కొత్త జోనర్‌లో సినిమా రాబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైల్డ్ డాగ్‌ తర్వాత నాగ్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.

నాగార్జున నటించిన శివ చిత్రం 1989న అక్టోబర్‌ 5నే విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు అదే డేట్‌కి ది ఘోస్ట్ రాబోతుండటం, తన కెరీర్‌లోనే ఇదొక కొత్త తరహా సినిమా అని నాగార్జున చెప్పడం విశేషం. అప్పటి మ్యాజిక్‌ ఏదైనా జరుగుతుందా అనేది ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేస్తుంది.

ఇదిలాఉండగా చిరంజీవి, నాగార్జున ఇండస్ట్రీలో మంచి స్నేహితులు, కలిసి బిజినెస్‌లు చేస్తుంటారు. ఇండస్ట్రీ విషయంలో ఇద్దరూ ముందుంటారు. అలాంటి వీరిద్దరి సినిమాలు పోటీ పడబోతుండటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలాఉండగా ఆగ్ర హీరోల సినిమాతో పొటీ పడుతూ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి స్వాతిముత్యం అనే ఓ చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో కొడుకు గణేష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా వర్ష బొల్లమ్మ హీరోయిన్. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. మరి ఈ ముగ్గురి మధ్య ఎవరు విజయం సాధిస్తారనేది రేపు(అక్టోబర్ 5)న తేలిపోతుంది.