Dharmapuri: స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ జరపండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం కలెక్టర్‌ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసిన కోర్టు విధాత బ్యూరో, కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలు గల్లంతైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తదుపరి తీసుకోబోయే చర్యలను వివరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం […]

  • Publish Date - April 12, 2023 / 04:37 PM IST

  • స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ
  • కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
  • కలెక్టర్‌ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి
  • విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసిన కోర్టు

విధాత బ్యూరో, కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలు గల్లంతైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తదుపరి తీసుకోబోయే చర్యలను వివరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం EVM స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా పడింది.

2018లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ పై 441 ఓట్ల తేడాతో ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికను సవాలు చేస్తూ లక్ష్మణ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరిచి, వివరాలు తమకు సమర్పించాలని కోర్టు ఇటీవల జగిత్యాల జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళంచెవులు మాయం కావడంతో వివాదం రేగింది.

Latest News