Congress | CPS విధానం రద్దు చేసి.. ప్రతి నెల 1న వేతనాలు ఇవ్వాలి: శ్రీ‌ధ‌ర్‌బాబు

Congress రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు విధాత: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులంతా ఉద్యమించారని, అలాంటి ఉద్యోగులు, పెన్షన్‌ దారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భగా 30 ఐఆర్‌, 4శాతం డీఏ ప్రకటించాలన్నారు. అలాగే […]

Congress | CPS విధానం రద్దు చేసి.. ప్రతి నెల 1న వేతనాలు ఇవ్వాలి: శ్రీ‌ధ‌ర్‌బాబు

Congress

  • రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు

విధాత: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులంతా ఉద్యమించారని, అలాంటి ఉద్యోగులు, పెన్షన్‌ దారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భగా 30 ఐఆర్‌, 4శాతం డీఏ ప్రకటించాలన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెల1వ‌ తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ ప్రతి నెల1వ‌ తేదీన వేతనాలు ఇచ్చే వాళ్లమని, పండుగల సమయంలో వేతనాలు ముందుగానే అందించే వారమని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వక పోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

నెల వారిగా చెల్లించాల్సిన ఈఎంఐలు చెల్లించ లేక పోవడంతో సిబిల్‌ స్కోర్‌ పడిపోయి, బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఉద్యోగులకు, పెన్ష‌షన్‌ దారులకు 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను ఆ లేఖలో శ్రీధర్‌ బాబు కోరారు.