దేశానికి, రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే: రేవంత్ రెడ్డి
విధాత: ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛ అని, అమరులను, వీరులను స్మరించు కుంటూ వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లోజాతీయ పతాకా విష్కరణ చేసి తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు […]

విధాత: ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛ అని, అమరులను, వీరులను స్మరించు కుంటూ వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లోజాతీయ పతాకా విష్కరణ చేసి తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే కాంగ్రెస్ అని తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ వచ్చిందంటే అప్పటి వీరుల త్యాగాలని వారిని స్ఫూర్తిని తీసుకొని నిరంకుశత్వ పాలనకు నిలబడి కొట్లాడాలన్నారు.

భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేశారు. బ్రిటిష్ స్వామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలను మొదలు పెట్టారు. బైరాంపల్లి ఘటనలు తెలంగాణాలో చాలా జరిగాయి. భూమి కోసం భుక్తి కోసం దండు కట్టిండ్రు దళంగా కదిలారు. వేలాది మంది వీరులు పోరాటం చేశారని పేర్కొన్నారు.

కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారు, ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారని, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో వందలాది సంస్థానాలుంటే కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం అయ్యాయి. కానీ మూడు ప్రాంతాలైన హైదరాబాద్, జమ్మూకాశ్మీర్ గుజరాత్‌లోని జునాఘడ్ పాకిస్థాన్‌లో కలుస్తామన్నాయన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయా ప్రాంతాలకు వెళ్లి అవి భారతదేశంలో విలీనం అయ్యేలా చేశారన్నారు., ప్రజాభిప్రాయం ద్వారా సంస్థానం భారత్ లో విలీనం అయ్యింది. బీజేపీ ముస్లిం హిందువుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వచ్చారు. నరేంద్ర మోడీ ఆదేశాలతో సెప్టెంబర్ 17 వేడుకలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారని అదే కోవలో నాటి హోం మంత్రి పటేల్.. నెహ్రు ఆదేశాల మేరకు చేశారు హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేశారని తెలిపారు.
ఇప్పుడు సాయుధ పోరాటం గురించి మాట్లాడే నాయకులు, ఆ పార్టీ అప్పుడెక్కడున్నాయన్నారు. అప్పటికీ బీజేపీ అసలే పుట్టలేదని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17 చేయని టీఆర్‌ఎస్ సర్కార్‌కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా ? అని నిలదీశారు.
మా నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను బీజేపీ దొంగిలించే ప్రయత్నం చేసింది. 1950లో గాంధీ భవన్‌కు పునాదులు వేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పటేల్‌కు దండేసి నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని విమర్శించారు. దేశంలో విస్తరించడానికి మోడీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని, కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని దోచి పెడుతున్నదన్నారు.విడగొట్టే పనిలో వారుంటే.. కలిపే పనిలో మేమున్నామన్నారు. వాట్సప్ యూనివర్శిటీలో ఓవర్ నైట్ పని చేయించి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కేసీఆర్ స్వీయ చరిత్ర, కుటుంబ చరిత్ర రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా, అందెశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా మారుస్తామన్నారు. సబ్బండ వర్గాల ప్రజల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని ఆ నమూనాను ఇవ్వాల విడుదల చేస్తున్నామన్నారు. ఎవరైనా ఈ తల్లిని ఏర్పాటు చేసుకోవచ్చని, కొత్త జెండా రూపుద్దిద్దుకుంటుందని, దానికి యువత, కవులు కళాకారుల మేధావుల ఆలోచనలు పంపాలని కోరారు.
కేసీఆర్ పెట్టిన కులాల కుంపటిని బీజేసీ అందిపుచ్చుకుని మతాల మధ్య చిచ్చు పెడుతోంది అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్న రేవంత్ రెడ్డిఅన్నారు. దేశాన్ని విభజించే పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెబుతున్న వాళ్ళు రాష్ట్రంలో కులాల మధ్య, మతా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
విలీన వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా జెండాను తయారు చేస్తామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ కీలక పాత్రను పోషించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎందరో మహానుభావులు తమ వీరోచిత పోరాటాలతో నాటి పెత్తందార్లను తరిమికొట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు.
మెరుగైన సమాజం కోసం అందరూ కృషి చేయాలి: భట్టి
విధాత,హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్, బీజేపీల పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంపై తెలంగాణ వజ్రోత్సవాల్లో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
దున్నేవాడికి భూమి కావాలన్న పోరాటం నుంచి భూమి హక్కు చట్టం ఎట్లా వచ్చింది? అన్న దానిపై చర్చ జరగాలని సూచించారు. ఆనాడు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహంతో పాటు పలు ఉద్యమాలు జరిపి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించారని చెప్పారు. 1948 సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుని మెరుగైన సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు.
నల్గొండ జిల్లాది ప్రముఖ పాత్ర: కోమటిరెడ్డి
సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రజాకార్లను తరిమికొట్టడంలో నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషించిందని గుర్తు చేశారు.సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రగల్భాలు పలికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిజాం, రజాకార్లను తరిమికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిదని కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంతోనే నిజాం తోకముడిచిండని కోమటిరెడ్డి అన్నారు.

వాళ్ళు ఉంటే వారి కాళ్ళు మొక్కుతా: హనుమంతరావు
బీజేపీ కేంద్ర నాయకత్వం హైదరాబాద్ విమోచక దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తే.. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ విమోచన అని, ఇప్పుడేమో సమైక్యత అంటున్నాడని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ పాత్ర అసలు ఉద్యమంలో లేనే లేదని.. అమిత్ షా మాత్రం గొప్పలు చెబుతున్నారని మండి పడ్డారు. సాయుధ పోరాటం తానే చేసినట్లు అమిత్ షా మాట్లాడుతున్నారని .. సాయుధ పోరాటంలో బీజేపీ వాళ్ళు ఉంటే వారి కాళ్ళు మొక్కుతానన్నారు.