Congress | తెలంగాణ దారిదోపిడీ దొంగలు బిల్లా, రంగాలు.. హరీష్, కేటీఆర్: రేవంత్ రెడ్డి

Congress కేసీఆర్ దోపీడికి 4కోట్ల ప్రజలు బలి ధనిక రాష్ట్రాన్ని.. KCR బొందలగడ్డగా మార్చాడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురునాథరెడ్డిని కలిసిన రేవంత్ - పార్టీలోకి అహ్వానం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన పలువురు నేతలు విధాత: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ బొందల గడ్డగా మార్చారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ దోపిడీకి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బలయ్యారన్నారు. ఇక కేసీఆర్ అరాచక పాలనను భరించే […]

Congress | తెలంగాణ దారిదోపిడీ దొంగలు బిల్లా, రంగాలు.. హరీష్, కేటీఆర్: రేవంత్ రెడ్డి

Congress

  • కేసీఆర్ దోపీడికి 4కోట్ల ప్రజలు బలి
  • ధనిక రాష్ట్రాన్ని.. KCR బొందలగడ్డగా మార్చాడు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • గురునాథరెడ్డిని కలిసిన రేవంత్ – పార్టీలోకి అహ్వానం
  • గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన పలువురు నేతలు

విధాత: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ బొందల గడ్డగా మార్చారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ దోపిడీకి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బలయ్యారన్నారు. ఇక కేసీఆర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు. తెలంగాణను కేసీఆర్ నుంచి విముక్తి కలిగించెందుకే ఈ చేరికలన్నారు. ఇవి గాలివాటం చేరికలు కాదని రేవంత్‌ స్పష్టం చేశారు.

శుక్రవారం ఉదయం రేవంత్‌రెడ్డి కొడంగల్ బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్‌ ఆహ్వానం మేరకు గతకొంత కాలంగా బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉన్న గుర్నాధరెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడానికి సిద్దమయయ్యారు.

గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అచ్చంపేట నియోజక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్, అచ్ఛంపేట, చారగొండ మండలాల బీఆరెస్ కార్యకర్తలు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. వారందరికి రేవంత్‌రెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేన్నారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అని అభివర్ణించారు. కేసీఆర్ కు తెలంగాణలో నూకలు చెల్లాయని, ఇక తెలంగాణను పాలించే అర్హత లేదన్నారు. తెలంగాణ దారిదోపిడీ దొంగలు బిల్లా, రంగా లు హరీష్, కేటీఆర్ లని ఆరోపించారు. కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్నాడని, కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని తెలిపారు.

పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. ఎలక్షన్లు , కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ టీఆర్‌ ఎస్‌ పెట్టారన్నారు. 22 ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్ కు న్యాయం జరిగిందా? అని అడిగారు. దోపిడీ దారులను పొలిమేరలు దాటే వరకు తరమాలని, ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. నల్లమల అడవుల్లో అచ్ఛంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు.