Congress | బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు

Congress విధాత: రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ రెడ్డి వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మఖ్యంగా నిర్మల్, మానకొండూరు కొడంగల్, గజ్వేల్, నియోజకవర్గాల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంతో పాటు గజ్వెల్‌ నియోజక వర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నిర్మల్‌ పట్టణానికి చెందిన […]

Congress | బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు

Congress

విధాత: రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ రెడ్డి వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మఖ్యంగా నిర్మల్, మానకొండూరు కొడంగల్, గజ్వేల్, నియోజకవర్గాల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంతో పాటు గజ్వెల్‌ నియోజక వర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నిర్మల్‌ పట్టణానికి చెందిన బీజేపీ నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

మాన కొండూరు నియోజకవర్గానికి చెందిన గన్నేరు వరం మండలం మైలారం, చొక్కారావు పల్లి, సాంబయ్య పల్లి సర్పంచులు గన్నేరు వరం ఎంపీటీసీ, ఖాసీంపేట ఉపసర్పంచ్‌తో పాటు పలువురు
కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.