Congress | కాంగ్రెస్‌లో కమిటీల లొల్లి.. గాంధీభవన్ తాకిన నిరసన సెగలు

Congress విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ కమిటీల భర్తీ వ్యవహారం ఆ పార్టీలో ముసలం రేపుతుంది. కమిటీల్లో స్థానం దక్కని కాంగ్రెస్ వర్గాలు ఏకంగా గాంధీ భవన్‌కు వెళ్లి మరి నిరసనకు దిగడం పారీ్టలో కమిటీల రచ్చకు నిదర్శనంగా నిలిచింది. మునుగోడు నియోజకవర్గం మండల కమిటీల్లో తమ వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదని పాల్వాయి స్రవంతి తన వర్గీయులతో కలిసి గాంధీభవన్ వద్ధ నిరసన వ్యక్తం చేశారు. అదే రీతిలో […]

  • Publish Date - July 6, 2023 / 04:05 PM IST

Congress

విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ కమిటీల భర్తీ వ్యవహారం ఆ పార్టీలో ముసలం రేపుతుంది. కమిటీల్లో స్థానం దక్కని కాంగ్రెస్ వర్గాలు ఏకంగా గాంధీ భవన్‌కు వెళ్లి మరి నిరసనకు దిగడం పారీ్టలో కమిటీల రచ్చకు నిదర్శనంగా నిలిచింది.

మునుగోడు నియోజకవర్గం మండల కమిటీల్లో తమ వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదని పాల్వాయి స్రవంతి తన వర్గీయులతో కలిసి గాంధీభవన్ వద్ధ నిరసన వ్యక్తం చేశారు. అదే రీతిలో భువనగిరి నియోజకవర్గంలో నియమించిన కాంగ్రెస్ మండల కమిటీలను రద్దు చేయాలని గాంధీ భవన్ వద్ద పారీీ్ట సీనియర్ నేత మల్లు రవి కారును అడ్డుకున్నారు.

భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు నిన్న నూతన అధ్యక్షులను నియమిస్తున్నట్లు పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేరు మీద ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆ కమిటీల్లో ఏళ్ల తరబడిగా పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని కమ్యూనిస్టు, టిడిపి, బిఆర్ఎస్ నుండి వచ్చిన వారికి ఏ విధంగా పదవులు ఇస్తారని ప్రశ్నిస్తు మల్లు రవి కారును అడ్డుకుని తమ నిరసన తెలిపారు.

కమిటీల భర్తీ పూర్తిగా అప్రాజస్వామికంగా ఎలాంటి సంప్రదింపులు లేకుండా కనీసం స్థానిక పార్లమెంట్ సభ్యులు పీసీసీ స్టార్ క్యాంపైనర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమాచారం ఇవ్వకుండానే, అలాగే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిరిసిల్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ గౌడ్ తదితరులతో చర్చించకుండా, స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయకుండా, కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా కమిటీలనలు నియమించారని వారు ఆరోపించారు. ఈ కమిటీలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోధ శ్రీనివాస్ గౌడ్ , వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డిలు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీలో గత 35 సంవత్సరాల నుండి క్రియాశీలకంగా పని చేస్తున్న ఫ్రతిపక్ష పార్టీల దాడులకు, అక్రమ కేసులకు గురయ్యామని, మా జీవితాలను కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేయడం జరిగిందన్నారు.

ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ నియమాలను పాటించకుండా తన సొంత ఎజెండాను అమలు చేస్తూ, తన తాబేదారులకు.. పార్టీ విధి విధానాలపై ఎలాంటి అనుభవం లేని వాళ్లకు పదవులు కట్టబెడుతు, ఆయన చెప్పు చేతిలో వ్యాపారం మాదిరిగా పార్టీని మార్చడం జరుగుతుందన్నారు.

ఇప్పటికైనా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీలో అనుభవాన్ని గుర్తించి పార్టీ పదవులను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సిరికొండ శివకుమార్, పులిగిల్ల బాలయ్య, గుమ్మడిల్లి రమేష్, ఉడత కార్తీక్ ,కొండాపురం గణేష్, పుట్ట కృష్ణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, షానూర్ బాబా నరసింహ, ధరణికోట పాండు, సాయిలు, ఎండి ఫకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.