Congress | 16న సీడబ్ల్యూసీ సమావేశం

Congress | విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం ఈనెల 16న హైదరాబాద్ లో నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదన్నారు. కాగా.. 17న సీడబ్ల్యుసీ సభ్యులతో పాటు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం కానుంది అని ఆయన పేర్కొన్నారు. అదేరోజు […]

  • By: Somu    latest    Sep 04, 2023 12:33 AM IST
Congress | 16న సీడబ్ల్యూసీ సమావేశం

Congress | విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం ఈనెల 16న హైదరాబాద్ లో నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదన్నారు.

కాగా.. 17న సీడబ్ల్యుసీ సభ్యులతో పాటు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం కానుంది అని ఆయన పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్ లో పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. పార్టీ జాతీయ నేతలు హాజరవుతారని తెలిపారు.