రేవంత్‌కు కాంగ్రెస్ సీనియర్ల ఝలక్!
రేపటి సమావేశాలకు దూరం ఉండాలని నిర్ణయం.. విధాత: టి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రేపు రేవంత్ ఆధ్వర్యంలో పిఎసి, పిసిసి ఎగ్జిక్యూటివ్ సమావేశాలు నిర్వహించనుండగా, ఈ సమావేశాలకు హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయించుకున్నారు. శనివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్లు ఉత్తంకుమార్ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, మధు యాష్కి, జగ్గారెడ్డి , […]

- రేపటి సమావేశాలకు దూరం ఉండాలని నిర్ణయం..
విధాత: టి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరి పట్ల ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రేపు రేవంత్ ఆధ్వర్యంలో పిఎసి, పిసిసి ఎగ్జిక్యూటివ్ సమావేశాలు నిర్వహించనుండగా, ఈ సమావేశాలకు హాజరు కాకూడదని సీనియర్లు నిర్ణయించుకున్నారు.
శనివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్లు ఉత్తంకుమార్ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, మధు యాష్కి, జగ్గారెడ్డి , కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి ప్రభృతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మద్దతు తెలిపారు.
ఇటీవల రేవంత్ ప్రకటించిన కాంగ్రెస్ కార్యనిర్వాక, రాజకీయ వ్యవహారాల కమిటీలలో టిడిపి నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడం పట్ల సీనియర్లు తమ అసమ్మతిని బాహాటంగా వెల్లడించారు. నూతన కమిటీల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు న్యాయం దక్కేవరకు రేవంత్ కార్యక్రమాలను బహిష్కరించాలని సీనియర్ల బృందం నిర్ణయించుకోవడంతో టీ.కాంగ్రెస్ లో అసమ్మతి వ్యవహారం రచ్చ కెక్కింది.
సీనియర్ల బహిష్కరణ నిర్ణయంపై రేవంత్ రెడ్డి రేపు ఏ విధంగా స్పందించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రేపు నిర్వహించనున్న కాంగ్రెస్ సమావేశాలకు ఎఐసిసి కార్యదర్శులు మాణిక్యం ఠాగూర్ ప్రభృతులు హాజరు కానుండగా వారు సీనియర్ల అసమ్మతి పట్ల ఎలాంటి వైఖరి వ్యక్తం చేస్తారో వేచి చూడాల్సిందే.
ఇప్పటికే సీనియర్ల అసమ్మతి ఎపిసోడ్ పై రేవంత్ వర్గం ఎలాంటి వాఖ్యలు చేయరాదని కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలివ్వడం గమనార్హం. మరోవైపు తమ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించేందుకు మరో రెండు మూడు రోజుల్లో మళ్లీ సమావేశం కావాలని కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయించుకున్నారు. అలాగే ఢిల్లీకి వెళ్లి రేవంత్ ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.