కష్టపడిన వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది : మంత్రి ఉత్తమ్‌

కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని, మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన బల్మూరీ, మహేశ్‌గౌడ్‌లు

విధాత : కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని, ఇందుకు బల్మూరి వెంకట్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు ఎమ్మెల్సీలుగా అవకాశం రావడమే నిదర్శనమని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్, ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు.


నామినేషన్ల దాఖలు అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక వాతావరణం ప్రజల కోసం పనిచేసే పార్టీ నాయకులు ఎవరికైనా ఉన్నత పదవులను అందేలా చేస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని ఆశిస్తున్నామన్నారు. గతంలో సర్పంచ్‌ల బిల్లులు ఆపిందే బీఆరెస్ ప్రభుత్వమని, ఇప్పుడు వారి తరపున పోరాడుతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రామమందిరం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. అసంపూర్తి గుడిని ప్రారంభించవద్దని శంకరాచార్యులు తప్పుబడుతున్నారని, వారికంటే ప్రధాని మోడీకి ఎక్కువ ఏం తెలుసన్నారు. జనవరి 22 తర్వాతా తాను అయోధ్య రాముడిని దర్శించుకుంటానని, తాను తన కుటుంబం రామభక్తులేమేనన్నారు.

Latest News