హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి
విధాత: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (35)ను దాటేసింది. హిమాచల్ ఓటర్లు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగించారు. మొత్తం 68 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో అధికార బీజేపీ 23 స్థానాల్లో గెలిచి మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో విజయం సాధించి మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. మార్పు కోసం మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరిన […]

విధాత: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (35)ను దాటేసింది. హిమాచల్ ఓటర్లు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగించారు.
మొత్తం 68 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో అధికార బీజేపీ 23 స్థానాల్లో గెలిచి మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో విజయం సాధించి మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది.
మార్పు కోసం మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరిన ఆప్ 68 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవలేదు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.