కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీ గెలుపు సోపానాలు: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా పనిచేయలేదని.. కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీ గెలుపుకు దోహదం చేశాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాహుల్ గాంధీ నే పెద్ద కార్యకర్తగా మారాడని, ఇది దేశ ప్రజల దురదృష్టమన్నారు. ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం లో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఒక్క హామీ నెరవేర్చకుండా, ప్రతిపక్షాలు లేకుండా గెలవడం బీజేపీ నైజమన్నారు. దిక్కులేని స్థితిలో గుజరాత్ ప్రజలు బీజేపీకి ఓటేశారన్నారు. పాలన సరిగా […]

  • By: krs    latest    Dec 08, 2022 1:29 PM IST
కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీ గెలుపు సోపానాలు: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా పనిచేయలేదని.. కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీ గెలుపుకు దోహదం చేశాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాహుల్ గాంధీ నే పెద్ద కార్యకర్తగా మారాడని, ఇది దేశ ప్రజల దురదృష్టమన్నారు.

ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం లో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఒక్క హామీ నెరవేర్చకుండా, ప్రతిపక్షాలు లేకుండా గెలవడం బీజేపీ నైజమన్నారు. దిక్కులేని స్థితిలో గుజరాత్ ప్రజలు బీజేపీకి ఓటేశారన్నారు.

పాలన సరిగా లేకున్నా గుజరాత్ లో బీజేపీ విజయం సాధించిందన్నారు. అద్భుతమైన పథకాలు, ఆదర్శవంతమైన పాలనతో తెలంగాణలో టీఆరెఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్య‌క్తం చేశారు.