అర్హత సాధించలేదని.. కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్య
విధాత, వరంగల్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చి ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయినందుకు మనస్థాపానికి గురైన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా సింగారం గ్రామానికి చెందిన జక్కుల రాజ్ కుమార్ అనే అభ్యర్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ ఉద్యోగం పొందేందుకు గత కొంతకాలంగా విజయ్ శ్రమిస్తున్నాడు. ఉద్యోగానికి సంబంధించిన అన్ని పరీక్షలు పాసయ్యాడు. తాజాగా జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మూడు […]

విధాత, వరంగల్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు మార్కులు తక్కువ వచ్చి ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయినందుకు మనస్థాపానికి గురైన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
హనుమకొండ జిల్లా సింగారం గ్రామానికి చెందిన జక్కుల రాజ్ కుమార్ అనే అభ్యర్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ ఉద్యోగం పొందేందుకు గత కొంతకాలంగా విజయ్ శ్రమిస్తున్నాడు.
ఉద్యోగానికి సంబంధించిన అన్ని పరీక్షలు పాసయ్యాడు. తాజాగా జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మూడు మార్కులు తక్కువ రావడంతో అర్హత కోల్పోయాడు. ఇంత కష్టపడినా తన కోరిక నెరవేరదని భావించి మనస్తాపంతో గురువారం పురుగుల మందు తాగగా ఎంజీఎం హాస్పిటల్‌కు అక్కడినుంచి మెరుగైన వైద్యంకోసం ఓ ప్రవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. కాగా, ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన ఏడు తప్పులకు ప్రభుత్వం ఏడు మార్కులు కలుపుతుందని భావించినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో వేచిచూసిన రాజ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
తప్పుగా వచ్చిన ఆ ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి ఉంటే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి పోలీసులు తరలించారు. కాగా, రాష్ట్రంలో వరుస మృతి సంఘటనలు కలకలం రేపుతున్నాయి.