Telangana Bhavan | ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణంపై నిర్ణయం

ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Bhavan | ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణంపై నిర్ణయం
  • పటౌడీ హౌస్‌ స్థలం ఎంపిక

Telangana Bhavan | విధాత: ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పటౌడీ హౌస్‌ ఉన్న ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ భవన్‌ నిర్మించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ భవన్ నిర్మాణంపై ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు.


పటౌడీ హౌస్‌కు సంబంధించిన సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటౌడీ హౌస్ లో ఉన్న స్థలం ఎంత, మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి? వంటి వివరాలను తెలుసుకుని, ఇందులో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇటీవల ఆర్‌ఆండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతం వీలైనంత త్వరగా తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని తెలిపారు.