పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌తో పాటు చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించింది. అన్ని రాష్ట్రాలు వీలైనంత వరకు అన్ని కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను ప్రతిరోజూ INSACOG జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ […]

పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.

జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌తో పాటు చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించింది. అన్ని రాష్ట్రాలు వీలైనంత వరకు అన్ని కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను ప్రతిరోజూ INSACOG జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ (IGSLలు)కి పంపేలా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కోరారు.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించవచ్చని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వారానికి 1200 కొత్త కేసులు వస్తున్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వారానికి 35లక్షల వరకు కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లోనూ అప్రమత్తత అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్‌లో కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.

గతవారం దేశవ్యాప్తంగా 12 మరణాలు నమోదవగా.. గడిచిన మూడు రోజుల్లో ఒక్క మరణం నమోదు కాలేదు. కరోనా కేసుల విషయానికి వస్తే గత వారంలో 1,103 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.