Council of Ministers Meeting l ఈనెల 9న ప్రగతిభవన్‌లో మంత్రి మండలి సమావేశం
సీఎం ఆదేశాలతో అన్ని శాఖలకు సమాచారమిచ్చిన సీఎస్ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం Council of Ministers meeting at Pragati Bhavan on 9th విధాత: తెలంగాణ మంత్రి మండలి(Council of Ministers) సమావేశం ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్(Pragati Bhavan)లో జరగనున్నది. సీఎం(CM) ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) అన్నిశాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, […]

- సీఎం ఆదేశాలతో అన్ని శాఖలకు సమాచారమిచ్చిన సీఎస్
- కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం
Council of Ministers meeting at Pragati Bhavan on 9th
విధాత: తెలంగాణ మంత్రి మండలి(Council of Ministers) సమావేశం ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్(Pragati Bhavan)లో జరగనున్నది. సీఎం(CM) ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) అన్నిశాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడా విధానం సహా పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నది.
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం మళ్లీ పేచి పెడుతున్నదనే భావనతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని యోచిస్తున్నది. వచ్చే వానాకాలం సీజన్‌కు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవడం, ఇతర సన్నద్ధతలపైనా మంత్రిమండలి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నది.
వీటితో పాటు మెస్ ఛార్జీల పెంపుదలపై రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సులను కేబినెట్ ఆమోదించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న కొత్త క్రీడా విధానంపై సిద్ధమైన ముసాయిదాకు ఆమోదముద్ర వేయనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణపై, పోడు భూములపై హైకోర్టు నోటీసులకు సమాధానం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ఇక కొత్త పీఆర్సీ కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞాపనలు వస్తున్నాయి. దీనిపై విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగ సంఘాల ఐకాస అభిప్రాయలను తీసుకుని 7న ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నది. దాని ఆధారంగా విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు సంబంధించిన అంశం, వాటి ఆమోదానికి ప్రత్యామ్నాయ మార్గాలపై మంత్రిమండలిలో చర్చించనున్నట్టు సమాచారం. ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పలు ఉత్తర్వులకు, కొత్త నియామకాలు అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది.