నిజామాబాద్: ఈనెల 20లోపు కౌన్సిలర్లు రాజీనామా చేయాలి: రైతు ఐక్య కార్యాచరణ కమిటీ
15న ప్రధాన రోడ్లపై ముగ్గులు వేయడం ఐక్య కార్యాచరణ కమిటీ భవిష్యత్ ప్రణాళిక వెల్లడి విధాత, నిజామాబాద్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో విలీన గ్రామాల కౌన్సిలర్లు ఈ నెల 20వ తేదీ వరకు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవి తాము రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కమిటీ ఆధ్వర్యంలో గురువారం లింగాపూర్ గ్రామంలో రైతులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను […]

- 15న ప్రధాన రోడ్లపై ముగ్గులు వేయడం
- ఐక్య కార్యాచరణ కమిటీ భవిష్యత్ ప్రణాళిక వెల్లడి
విధాత, నిజామాబాద్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో విలీన గ్రామాల కౌన్సిలర్లు ఈ నెల 20వ తేదీ వరకు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవి తాము రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
కమిటీ ఆధ్వర్యంలో గురువారం లింగాపూర్ గ్రామంలో రైతులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ నెల 15న ప్రధాన రహదారులపై కుటుంబ సమేతంగా వచ్చి ముగ్గులు వేసి నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరిగి 17న కమిటీ పాతరాజంపేటలో సమావేశం కానున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కాగా 1వ వార్డు నుండి కౌన్సిలర్ గడ్డమీది రాణి, 2వ వార్డు సుతారి రవి, 6వ వార్డు ఆకుల రూప, 9వ వార్డు పడిగె సుగుణ, 10వ వార్డు ఉర్దొండ వనిత, 11వ వార్డు కాసర్ల శ్రీనివాస్, 12వ వార్డు కాసర్ల గోదావరి, 13వ వార్డు శంకర్ రావు, 35వ వార్డు పోలీస్ కృష్ణాజిరావు విలీన గ్రామాల నుండి మున్సిపల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయాలని కమిటీ వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు విధించింది. రాజీనామా చేసిన వారిని తిరిగి తాము గెలిపించుకుంటామని రైతులు తెలిపారు.