Delhi
విధాత: ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో యువత వెలికి చేష్టలు శృతిమించుతున్నాయి. ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందనే కనీస సోయి కూడా లేకుండా కొన్ని జంటలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీలో మోటార్‌సైకిల్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్న ఒక జంటకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించి తిక్క కుదిర్చారు.
Taking cognisance of a viral video wherein the two-wheeler was being driven dangerously, @dtptraffic has booked the offender under appropriate sections. A total fine of Rs. 11,000 has been imposed.
Please don’t copy movies. Drive safe. Be safe.#DriveSafe#RoadSafety pic.twitter.com/P6auuS4YAS
— Delhi Police (@DelhiPolice) July 20, 2023
ఇటీవల ఫ్యూయల్ ట్యాంక్‌పై కూర్చున్న మహిళతో బైక్ నడుపుతున్నవ్యక్తి కౌగిలించుకొని రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు బైకర్‌కు రూ.11,000 జరిమానా విధించారు. రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రయాణికుడు వారి పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
Delhi Couple’s ‘Romance’ on Speeding Bike Draws Police Attention, Video Surfaces Online pic.twitter.com/kjb95vwNlz
— DARK KING (@darkking_main) July 18, 2023
“ద్విచక్ర వాహనాన్ని ప్రమాదకరంగా నడుపుతున్న వైరల్ వీడియోను గుర్తించి, నిందితుడిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. మొత్తం రూ. 11,000 జరిమానా విధించాం. దయచేసి సినిమాల్లో వలె ప్రవర్తించవద్దు. సురక్షితంగా డ్రైవ్ చేయండి. సురక్షితంగా ఉండండి అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.