పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్యాయత్నం.. వెలగని అగ్గిపుల్ల!
విధాత: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కేఆర్ పురం పరిధిలోని ఎస్ ఆర్ లే అవుట్‌లో నాలాలపై అక్రమంగా ఇండ్లు నిర్మించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం అక్కడికి అధికారులు బుల్డోజర్లతో చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. దీంతో సునీల్ సింగ్, సోనాసేన్ […]

విధాత: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కేఆర్ పురం పరిధిలోని ఎస్ ఆర్ లే అవుట్‌లో నాలాలపై అక్రమంగా ఇండ్లు నిర్మించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం అక్కడికి అధికారులు బుల్డోజర్లతో చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. దీంతో సునీల్ సింగ్, సోనాసేన్ అనే దంపతులిద్దరూ తమ ఇంటిని కూల్చొద్దంటూ అధికారులకు మొర పెట్టుకున్నారు. పోలీసులు, అధికారులు వినిపించుకోలేదు. దీంతో పెట్రోల్ పోసుకున్నారు. నిప్పంటించుకునేందుకు సోనా సేన్ అగ్గిపుల్లను వెలిగించింది.
కానీ వారి అదృష్టం బాగుండి ఆ అగ్గిపుల్ల వెలగలేదు. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు కలిసి ఆ దంపతులపై నీళ్లు గుమ్మరించి, ప్రాణాలతో కాపాడారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే అధికారుల తీరుపై సునీల్ సింగ్, సోనా సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్మించుకున్న ఇల్లు అక్రమం కాదన్నారు. ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని, అయినా అధికారులు వినిపించుకోలేదని వాపోయారు.