COVID-19 | కొవిడ్‌ కేసులు పెరుగుదల.. నేడు, రేపు మాక్‌డ్రిల్‌

COVID-19 | దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో డ్రిల్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దవాఖానాతో పాటు చికిత్సకు అనుమతి పొందిన అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో డ్రిల్‌ జరుగనున్నది. ఇందులో భాగంగా కరోనా కేసులు పెరిగితే ఎలా చికిత్స అందించాలో సిబ్బందికి మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. బాధితుడి లక్షణాలు బట్టి ఎలాంటి చికిత్స […]

COVID-19 | కొవిడ్‌ కేసులు పెరుగుదల.. నేడు, రేపు మాక్‌డ్రిల్‌

COVID-19 | దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో డ్రిల్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దవాఖానాతో పాటు చికిత్సకు అనుమతి పొందిన అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో డ్రిల్‌ జరుగనున్నది. ఇందులో భాగంగా కరోనా కేసులు పెరిగితే ఎలా చికిత్స అందించాలో సిబ్బందికి మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. బాధితుడి లక్షణాలు బట్టి ఎలాంటి చికిత్స అందించాలో సూచనలిస్తారు.

అంబులెన్స్ డ్రైవర్లు మొదలు కొవిడ్ చికిత్సలో భాగమయ్యే ప్రతి విభాగం సిబ్బంది శిక్షణలో భాగస్వాములుకానున్నారు. చివరగా రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ 27న మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొన్ని వారాలుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం రోజువారి కేసులు 5వేలకుపైగా నమోదయ్యాయి. పాజిటివిటీ 3.3శాతం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది. మరో వైపు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో మాస్క్‌ తప్పనిసరిగా చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కేరళ, హర్యానాతో పాటు పుదుచ్చేరిలో ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి.