ఆ దేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ టెస్ట్‌లు తప్పనిసరి

విధాత‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తున్న వేళ వైరస్‌ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. చైనా, జపాన్‌, దక్షిణకొరియా, హాంగ్‌కాంగ్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చేవారికి తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేశారు. కొత్త […]

ఆ దేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్‌ టెస్ట్‌లు తప్పనిసరి

విధాత‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తున్న వేళ వైరస్‌ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది.

చైనా, జపాన్‌, దక్షిణకొరియా, హాంగ్‌కాంగ్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చేవారికి తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేశారు. కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.