Viral Video | బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో ఎత్తిపడేసి..
Viral Video | వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేసిన ఘటనలు అనేకం చూశాం. పిల్లలు, పెద్దలపై కుక్కలు దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే ఓ ఆవు కూడా రెచ్చిపోయింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికపై ఆవు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని ఎంఎండీఏ కాలనీకి చెందిన ఓ తల్లి తన కుమారుడిని, కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. వారి ముందు […]

Viral Video |
వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేసిన ఘటనలు అనేకం చూశాం. పిల్లలు, పెద్దలపై కుక్కలు దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే ఓ ఆవు కూడా రెచ్చిపోయింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికపై ఆవు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని ఎంఎండీఏ కాలనీకి చెందిన ఓ తల్లి తన కుమారుడిని, కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. వారి ముందు ఓ ఆవు తన దూడతో కలిసి వెళ్తుంది. ఉన్నట్టుండి.. వెనక్కి మళ్లిన ఆవు.. బాలికపై దాడి చేసింది. బాలికను తన కొమ్ములతో లేపేసింది ఆవు.
Viral Video | బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో ఎత్తిపడేసి దాడి.. | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/NUcG3sJh4d#viral #chennai #BholaaShankar #Jailer #Jailer #Adipurush, #VarahiVijayaYatra pic.twitter.com/hVBeypjLoY
— VIDHAATHA MOVIES (@VidhaathaP) August 11, 2023
ఆ తర్వాత చిన్నారిని కిందపడేసి.. దాడి చేసింది. తల్లి అరుపులకు స్థానికులు అప్రమత్తమయ్యారు. బాలికను ఆవు దాడి నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
వారిపై కూడా ఆవు దాడి చేసేందుకు యత్నించింది. చివరకు ఓ వ్యక్తి కర్రతో ఆవులను బాదగా అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. తీవ్ర గాయాలపాలైన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.