గోశాలలో పవన్: గో పూజ చేసి.. క‌నుమ ఉత్స‌వాలు!

భ‌గ‌వ‌ద్గీత‌లో కృష్ణుడు చెప్పిన‌ట్టుగా క‌ర్మ మ‌న ప‌ని.. ఫ‌లితం భ‌గ‌వంతుడిది ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు రాజ‌కీయాలు త‌న గోశాల‌లోని ఆవుల‌కు స్వ‌యంగా అర‌టిపండ్లు అంద‌జేత‌ విధాత‌: పవన్ కు చారిత్రక పుస్తకాలే కాక ఆధ్యాత్మిక పుస్తకాలన్నా కూడా ఎంతో ఇష్టం. ఆయన ఇంత పెద్ద స్టార్ అయ్యుండి ఇంత సింపుల్ గా ఉండడానికి కారణం ఆ ఆధ్యాత్మిక చింతనే కారణమని అంటారు. అలాగని ఈయన పూర్తిగా ఆధ్యాత్మికంగా మునిగిపోలేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు త‌న ప్రయత్నం […]

  • By: krs    latest    Jan 17, 2023 11:55 AM IST
గోశాలలో పవన్: గో పూజ చేసి.. క‌నుమ ఉత్స‌వాలు!
  • భ‌గ‌వ‌ద్గీత‌లో కృష్ణుడు చెప్పిన‌ట్టుగా క‌ర్మ మ‌న ప‌ని.. ఫ‌లితం భ‌గ‌వంతుడిది
  • ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు రాజ‌కీయాలు
  • త‌న గోశాల‌లోని ఆవుల‌కు స్వ‌యంగా అర‌టిపండ్లు అంద‌జేత‌

విధాత‌: పవన్ కు చారిత్రక పుస్తకాలే కాక ఆధ్యాత్మిక పుస్తకాలన్నా కూడా ఎంతో ఇష్టం. ఆయన ఇంత పెద్ద స్టార్ అయ్యుండి ఇంత సింపుల్ గా ఉండడానికి కారణం ఆ ఆధ్యాత్మిక చింతనే కారణమని అంటారు. అలాగని ఈయన పూర్తిగా ఆధ్యాత్మికంగా మునిగిపోలేదు.

భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు త‌న ప్రయత్నం తాను చేస్తున్నాడు. కర్మ చేయడం మన పని. ఆ తరువాత అది మంచా చెడా దాని ఫ‌లితం ఏమిటి? అనేవి భగవంతుడు చూసుకుంటాడు అనేది ఆయన సిద్ధాంతం. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. కాగా ఈయన హిందూ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తాడు. తన ఫామ్ హౌస్ లో స్వయంగా చెట్లు నాటి కూరగాయలు, పండ్లు పండిస్తాడు.

కృత్రిమ ఎరువులు వాడకుండా ఆర్గానిక్ కూరగాయలు పండ్లు పండిస్తూ ఆ చెట్లకు నీరు పోస్తూ ఆ చెట్ల కిందనే నులక మంచం వేసుకొని విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాడు. ఆయనకు ఓ గోశాల కూడా ఉంది. కనుమ రోజున ఈ గోశాలలో పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా గడిపారు. కనుమ సందర్భంగా గోశాలలో గోపూజ నిర్వహించారు. పశువులకు పూజలు చేశారు.

హిందువులకు గోమాత సాక్షాత్తు దైవస్వరూపం. సకల దేవతా స్వరూపంగా మనం గోమాతను సేవిస్తాం. గోవు ఒక పశువు కాదు. అది మనకు ఒక అమ్మ లాంటిది. అందుకే మనం గోమాత అని అంటాం. ఇక కనుమ అంటే పశుపక్షాదులను గౌరవించే పండుగ.

రైతుకు వ్యవసాయంలో సాయం చేసే పశువులను ఆరాధించే వేడుక. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనుమ సందర్భంగా సంప్రదాయబద్ధంగా తన వ్యవసాయ క్షేత్రంలో కనుమ పండుగ వేడుకలు జరిపారు. గోపూజ నిర్వహించారు. ఆవులకు స్వయంగా అరటి పళ్ళు నోటికి అందించారు అని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

ఇక పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు. ఆయన ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకుంటారు. ఫామ్ హౌస్ లో మొక్కలు పెంచడం నీళ్లు పోయడం పశువులను చూసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మళ్లీ ఆయన గోశాలలో కనిపించారు.

ఇక సినిమాల పరంగా వస్తే ఆయన క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో ఎ. ఏం. రత్నం నిర్మాతగా హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

దీని తర్వాత తమిళ మూవీ తేరీకి రీమేక్ గా తెలుగులో హరీష్‌ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేయనున్నాడు. పవన్‌తో చిత్రాలు చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. వీరిలో సాహో సుజిత్, సురేంద‌ర్ రెడ్డి నుంచి ఎందరో పేర్లు వినిపిస్తున్నాయి.

మొత్తానికి అటు రాజకీయాలలో ఇటు సినిమాల పరంగా పవన్ బిజీ బిజీ. ఏపీలో ఎన్నికలు త్వరలో రానుండ‌డంతో ఆయన రాజకీయాలపై పూర్తి దృష్టిని కేంద్రీకరించ‌నున్నాడు.

అందులో భాగంగా తన వారాహి వాహనంలో ఆయన ఏపీలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా యాత్రను చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న పవన్ ను అభినందించి తీరాల్సిందే….!