ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప్ర‌త్య‌క్ష‌మైన మొస‌లి.. భ‌య‌ప‌డ్డ విద్యార్థులు

విధాత : ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో విద్యార్థులంద‌రూ ఆడుకుంటున్నారు. అంత‌లోనే ఓ భారీ మొస‌లి ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో విద్యార్థులు భ‌య‌ప‌డి త‌ర‌గ‌తి గ‌దుల్లోకి ప‌రుగులు తీశారు. టీచ‌ర్ల‌కు చెప్ప‌డంతో వారు గ్రామ‌స్తుల‌కు స‌మాచారం అందించారు. స్కూల్ వ‌ద్ద‌కు చేరుకున్న గ్రామస్తులు.. మొస‌లిని బంధించి క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. ఫారెస్టు అధికారులు వ‌చ్చే వ‌ర‌కు ఆ మొస‌లిని ఓ క్లాస్ రూమ్‌లో బంధించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అలీఘ‌ర్ జిల్లాలోని ఖాసీంపూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో వెలుగు చూసింది. అయితే ఖాసింపూర్ […]

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప్ర‌త్య‌క్ష‌మైన మొస‌లి.. భ‌య‌ప‌డ్డ విద్యార్థులు

విధాత : ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో విద్యార్థులంద‌రూ ఆడుకుంటున్నారు. అంత‌లోనే ఓ భారీ మొస‌లి ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో విద్యార్థులు భ‌య‌ప‌డి త‌ర‌గ‌తి గ‌దుల్లోకి ప‌రుగులు తీశారు. టీచ‌ర్ల‌కు చెప్ప‌డంతో వారు గ్రామ‌స్తుల‌కు స‌మాచారం అందించారు. స్కూల్ వ‌ద్ద‌కు చేరుకున్న గ్రామస్తులు.. మొస‌లిని బంధించి క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. ఫారెస్టు అధికారులు వ‌చ్చే వ‌ర‌కు ఆ మొస‌లిని ఓ క్లాస్ రూమ్‌లో బంధించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అలీఘ‌ర్ జిల్లాలోని ఖాసీంపూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో వెలుగు చూసింది.

అయితే ఖాసింపూర్ గ్రామ స‌మీపంలోని చెరువులో అనేక‌సార్లు మొస‌లిని చూశామ‌ని స్థానికులు తెలిపారు. అదే మొస‌లి స్కూల్ ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు. ఇక స్కూల్లో బంధించిన మొస‌లిని ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకుని, గంగా న‌దిలో వ‌దిలిపెట్టారు.