Mla Veeresham: ఎమ్మెల్యే వేముల వీరేశానికి “న్యూడ్ కాల్” బెదిరింపులు!

విధాత, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరిని వదకుండా మోసం చేస్తూ రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యేలను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Mla Vemula Veeresham) ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్(Nude Call)తో బెదిరింపుల(Threatened)కు దిగారు. న్యూడ్ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాధిత ఎమ్మెల్యే వీరేశం కథనం మేరకు నిన్న రాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి అమ్మాయి నగ్నంగా కనిపించింది. మొబైల్ స్క్రీన్‌పై ఆ సీన్ చూడగానే వేముల వీరేశం ఫోన్ కట్ చేశాడు. కానీ అదంతా స్క్రీన్ రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ వీడియోను ఆయనకే పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ వీడియోను కుటుంబసభ్యులు, మిత్రులకు పంపించడమే కాకుండా సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపించారు. ఆ వీడియో చూసిన వెంటనే సదరు నేతలు, కార్యకర్తలు వేముల వీరేశానికి ఫోన్ చేసి ఆరా తీశారు.
దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. సైబర్ నేరగాళ్ల నంబర్‌ను బ్లాక్ చేయాలని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే వీరేశం మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తనకు మధ్యప్రదేశ్ నుంచి న్యూడ్ వీడియో సెబర్ కాల్ వచ్చిందన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సెల్ ఫోన్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వీఐపీలను సెబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని, వారి వలలో పడి కొందరు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నేరాలపై ఉక్కు పాదం మోపుతుందన్నారు. ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సెల్ ఫోన్ రింగ్ టోన్ పెట్టామని తెలిపారు.
cyber attack on #telangana #nakrekal mla #vemulaveeresham via nude call pic.twitter.com/ecM9iAJHr1
— srk (@srk9484) March 5, 2025