క‌డియం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి : దాస్యం విన‌య్ భాస్క‌ర్

క‌నీస నైతిక‌త‌, వ‌య‌స్సు పై గౌర‌వం ఉంటే ముందుగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి త‌ర్వాత ఏ పార్టీలోనైనా చేరాల‌ని క‌డియం శ్రీ‌హ‌రికి దాస్యం విన‌య్ భాస్క‌ర్ డిమాండ్ చేశారు

క‌డియం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి : దాస్యం విన‌య్ భాస్క‌ర్
  • రాజ‌కీయ చీడ‌పురుగు క‌డియం
  • బ్లాక్ మెయిల్ చేసి ప‌ద‌వులు పొందుతారు
  • క‌నీస నైతిక‌త‌లేని నేత క‌డియం
  • ద‌ళిత నాయ‌కుల‌ను ఎద‌గ‌నీయ‌ని కుట్ర‌దారు
  • మాజీ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్


విధాత‌, వ‌రంగ‌ల్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: క‌నీస నైతిక‌త‌, వ‌య‌స్సు పై గౌర‌వం ఉంటే ముందుగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి త‌ర్వాత ఏ పార్టీలోనైనా చేరాల‌ని క‌డియం శ్రీ‌హ‌రికి మాజీ చీఫ్ విప్ హ‌నుమ‌కొండ బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు దాస్యం విన‌య్ భాస్క‌ర్ డిమాండ్ చేశారు. నిత్యం నీతులు చెప్పే శ్రీ‌హ‌రి క‌నీసం ఈ సారైనా పాటించాల‌ని సూచించారు. ఏ పార్టీలో ఉన్నా, స్వ‌లాభం కోసం, నీ రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం ఆ పార్టీలో త‌న‌కన్నా ముందున్న నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అణ‌చివేసి అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన కుట్ర‌లు అనేకం ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హ‌నుమ‌కొండ పార్టీ జిల్లా కార్యాల‌యంలో శుక్ర‌వారం మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి


గ‌తంలో టీడీపీలో ప‌నిచేసినపుడు ఆ పార్టీ నేత చంద్ర‌బాబును బ్లాక్ మెయిల్ చేసి అనేక ప‌ద‌వులు అనుభ‌వించార‌ని గుర్తుచేశారు.ఎదుగుతున్న ద‌ళిత నాయ‌కుల‌పై కుట్ర‌లు చేసి, చాడీలు చెప్పిన నీచ‌మైన చ‌రిత్ర అంటూ విమ‌ర్శించారు. గ‌త అహంకార పూరిత చ‌ర్య‌లు మ‌రిచి తెలంగాణ కోసం నేనూ, కెటీఆర్‌, పెద్ది నిస్వార్ధంతో పార్టీలోకి ఆహ్వ‌నించామ‌న్నారు. బీఆర్ఎస్‌లోకి రాగానే నీ స్వార్ధానికి విజ‌య‌రామారావు, ప‌ర‌మేశ్వ‌ర్‌, దొమ్మాటి సాంబ‌య్య‌, ప‌సునూరి ద‌యాక‌ర్‌, అరూరి ర‌మేష్ లు నీ కోసం, నీప‌ద‌వుల కోసం బ‌లైపోయార‌ని వివ‌రించారు.


సిట్టింగ్ ఎమ్మెల్యేను రాజ‌య్య‌ను కాద‌ని నీకు ఎమ్మెల్యేగా అవ‌కాశం క‌ల్పించార‌న్నారు. నీతి నిజాయితీ అంటూ నీవు బ్లాక్ మెయిల్ చేసి నీ బిడ్డ కోసం వ‌రంగ‌ల్ ఎంపీ టికెట్ సాధించావ‌ని వివ‌రించారు. నీ మీద‌, కావ్య అభ్య‌ర్ధిత్వం పై అనేక మంది ఉద్య‌మ‌కారులు, ద‌ళిత సంఘాలు వ్య‌తిరేకించినా వారిని ఒప్పించే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. కానీ, రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీతో ప్ర‌త్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసుకుని నువ్వూ, నీ బిడ్డ ఓ లేఖ‌ను విడుద‌ల చేయ‌డం సిగ్గుచేటన్నారు.

ప‌ద‌వుల‌న్నీ అనుభ‌వించిన క‌డియంః పెద్ది


పార్జీలోకి వ‌చ్చిన కొద్ది కాలానికే ఎన్ని ప‌ద‌వులు ఉంటే అన్నింటిని అనుభ‌వించిన చ‌రిత్ర క‌డియం శ్రీ‌హ‌రిదంటూ న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ అన్ని ప‌ద‌వులు అనుభ‌వించి అధికారం కోల్పోగానే ద్రోహం చేసే చ‌రిత్ర క‌డియం శ్రీ‌హ‌రిదంటూ విమ‌ర్శించారు. ఇప్ప‌టి నుంచి శ్రీ‌హ‌రి రాజ‌కీయ విలువలు, నిజాయితీ అంటూ నీతులు చెప్ప‌డం మానుకోవాల‌ని సూచించారు. ఏ మాత్రం చిత్త‌శుద్ది ఉన్నా ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఉద్య‌మ‌కాల‌మంతా టీడీపీలో ఉండి త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరినా నీకు ఎంపీ ప‌ద‌వి, ఆ త‌ర్వాత ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ, నీ కోసం వ‌రంగ‌ల్ ఎంపీ ఉప ఎన్నిక‌లు తెచ్చార‌ని వివ‌రించారు.


త‌ర్వాత ఖాళీగా ఉంటున్నావంటే మ‌రోసారి ఎమ్మెల్సీ ఇచ్చార‌ని చెప్పారు. ఎమ్మెల్సీగా ఉంటూ స్టేష‌న్ ఘ‌న్ పూర్ లో రాజ‌కీయం చేస్తే అక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని నీకు ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇచ్చార‌న్నారు. తాజాగా నీ బిడ్డ‌కు ఎంపీ టికెట్ సైతం ఇచ్చార‌ని చెప్పారు. ఇన్ని ప‌ద‌వులు అనుభ‌వించేందుకు ఎంద‌రో ద‌ళిత‌, ఉద్య‌మ నాయ‌కులు త్యాగాలు చేశార‌నే అంశాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. ఇప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ లో చేరేందుకు ప్యాకేజీకి సిద్ధ‌మ‌య్యావ‌ని అధికారం ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఉంటూ నీతులు చెప్ప‌డం నీకు రివాజుగా మారింద‌న్నారు.


క‌డియం లాంటి వ్య‌క్తుల నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.. రేప‌టి నుంచి కాంగ్రెస్ లో కూడా ఇద్ద‌రిని క‌లువనియ్య‌ర‌ని గుర్తుచేశారు.మా పార్టీ నుంచి వ‌చ్చే వారి ప‌ట్ల కాంగ్రెస్ నాయ‌కులు జాగ్ర‌త్త‌వ‌హించాల‌ని హెచ్చ‌రించారు. ఈ మీడియా స‌మావేశంలో జ‌డ్పీ చైర్మెన్ సుధీర్‌కుమార్‌, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌, మాజీ ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గండ్ర , న‌న్న‌పునేని, నాయ‌కులు జోరిక ర‌మేష్, నాగుర్ల‌, మ‌ర్రియాద‌వ‌రెడ్డి, సుదంద‌ర్ రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. మైనారీటి నేత న‌యీమొద్దీన్ అధ్వ‌ర్యంలో పార్టీ కార్యాల‌యం వ‌ద్ద క‌డియం దిష్టి బొమ్మ ద‌హ‌నం చేశారు.