Viral Video | మెడ‌పై కాలుపెట్టి మామ‌ను చిత‌క‌బాదిన కోడ‌లు..

Viral Video | మామ‌పై కోడ‌లు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసింది. వృద్ధుడి మెడ‌పై కాలు పెట్టి, జుట్టు ప‌ట్టి లాగింది. అంత‌టితో ఆగ‌కుండా ఇటుక‌తో త‌ల‌పై మోదింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని ఉత్త‌ర‌కాశీ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌కాశీలోని బ‌డ‌గ‌డిప‌ట్టి గ్రామానికి చెందిన ఓ మ‌హిళ‌.. త‌న మామ‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టింది. ఆ వృద్ధుడి జుట్టును ప‌ట్టుకుని చిత‌క‌బాదింది. మంచం వ‌ద్ద‌కు తీసుకెళ్లి.. అత‌ని త‌ల‌ను వంచి, మెడ‌పై కాలు పెట్టి దారుణంగా […]

Viral Video | మెడ‌పై కాలుపెట్టి మామ‌ను చిత‌క‌బాదిన కోడ‌లు..

Viral Video | మామ‌పై కోడ‌లు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసింది. వృద్ధుడి మెడ‌పై కాలు పెట్టి, జుట్టు ప‌ట్టి లాగింది. అంత‌టితో ఆగ‌కుండా ఇటుక‌తో త‌ల‌పై మోదింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని ఉత్త‌ర‌కాశీ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌కాశీలోని బ‌డ‌గ‌డిప‌ట్టి గ్రామానికి చెందిన ఓ మ‌హిళ‌.. త‌న మామ‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టింది. ఆ వృద్ధుడి జుట్టును ప‌ట్టుకుని చిత‌క‌బాదింది. మంచం వ‌ద్ద‌కు తీసుకెళ్లి.. అత‌ని త‌ల‌ను వంచి, మెడ‌పై కాలు పెట్టి దారుణంగా హింసించింది.

అక్క‌డే ఉన్న ఓ ఇటుక‌తో త‌ల‌పై మోదింది. ఈ దాడిని ఆపేందుకు ఓ వ్య‌క్తి య‌త్నించాడు. సుమారు ఒక నిమిషం పాటు మామ‌పై కోడ‌లు దాడి చేసిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఆహారం విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం తలెత్తిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌కాశీ ఎస్పీ అర్ప‌న్ యాదువ‌న్షీ స్పందించారు. వీడియోను ప‌రిశీలించామ‌ని తెలిపారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. విచార‌ణ అనంతరం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్పీ స్ప‌ష్టం చేశారు.