న్యూ ఇయర్‌ రోజున షాకిచ్చిన వార్నర్‌ మామ..! వన్డేలకు వీడ్కోలకు..!

న్యూ ఇయర్‌ రోజున ఆస్ట్రేలియా లెజెంటరీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు

న్యూ ఇయర్‌ రోజున షాకిచ్చిన వార్నర్‌ మామ..! వన్డేలకు వీడ్కోలకు..!

David Warner | న్యూ ఇయర్‌ రోజున ఆస్ట్రేలియా లెజెంటరీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. వన్డేలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఇప్పటికే వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అవసరమైతే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి సైతం అందుబాటులో ఉంటానని వార్నర్‌ పేర్కొన్నాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడిన తర్వాత ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతానని చెప్పాడు.


భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే తనకు చివరిదని చెప్పుకొచ్చాడు. వన్డేల నుంచి రిటైర్‌ అయినా టీ20 క్రికెట్‌లో కొనసాగుతానని.. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నట్లు వార్నర్‌ తెలిపాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. తన నిర్ణయంతో కొత్త క్రీడాకారులకు అవకాశాలు వస్తాయని తెలిపాడు. రాబోయే రెండేళ్లలో తాను డీసెంట్‌ క్రికెట్‌ ఆడితే.. అవసరమునుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని తెలిపాడు.


ఇదిలా ఉండగా.. 15 సంవత్సరాల అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 161 మ్యాచ్‌లు వార్నర్‌ ఆడాడు. 45 సగటుతో 6,932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలున్నాయి. 2015, 2023 సంవత్సరాల్లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లను ఆస్ట్రేలియా సాధించడంలో వార్నర్‌ కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ జరగ్గా.. మెగా టోర్నీలో వార్నర్‌ మామ కీ రోల్‌ పోషించాడు. పది మ్యాచులు ఆడి 528 పరుగులు చేశాడు. ఈ నెల 3న నుంచి పాక్‌తో జరిగే టెస్టు వార్నర్‌కు చివరి టెస్ట్‌. ఈ టెస్టు సిడ్నీ మైదానంలో జరుగనున్నది. కెరీర్‌లో ఇప్పటి వరకు 110 టెస్టులు ఆడిన వార్నర్‌ 44.82 సగటుతో 8,651 పరుగులు చేశాడు. టెస్టుల్లో 26 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలున్నాయి.