15కు చేరిన రైలు ప్రమాద మృతులు

- ప్రమాద బాధితులకు సీఎం వైఎస్ జగన్ పరామర్శ
- ప్రమాద స్థలి పరిశీలన
- ట్రాక్ పునరుద్దరణతో రైళ్ల రాకపోకలు షురు
విధాత : కంటాకపల్లి రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సోమవారం పరామార్శించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15మంది చనిపోగా, మరో 50మందికి పైగా తీవ్ర గాయలపాలయ్యారు. విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం జగన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరుపునా అందించాల్సిన తక్షణ సహయంతో పాటు ఎక్స్‌గ్రేషియా మొత్తాలను వెంటనే చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అటు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. రైళ్ల రాకపోకల పునరుద్దరణకు వీలుగా చాల వేగంగా ప్రమాదానికి గురైన రైళ్లకు సంబంధించిన ఎనిమిది బోగీలను, శిధిలాలను, దెబ్బతిన్న పట్టాలను తొలగించి ట్రాక్ పునరుద్ధరణ చేశారు. ప్రమాదం జరిగిన 19గంటల వ్యవధిలో ట్రాక్ పునరుద్ధరణ చేసి, గూడ్స్ రైలుతో ట్రయల్ వేసి, అదే మార్గంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను పంపించడం విశేషం. ట్రాక్ పునద్దరణ, సహాయక చర్యలపై వాల్తెరు రైల్వే డివిజన్ అధికారులు స్పందిస్తూ రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో రైళ్ల రాకపోకల పునరుద్దరణ వేగంగా జరిగిందని, ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందానరని, 30మంది గాయపడ్డారని తెలిపారు. ప్రమాద కారణాలపై సేప్టీ కమిషన్ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. మృతులకు 10లక్షల ఆర్ధిక సహాయం, గాయపడిన వారికి 2.50లక్షల సహాయం రైల్వేశాఖ అందిస్తుందన్నారు.