తుర్కియే, సిరియాలో మృత్యుకేళీ.. 15వేలు దాటిన మృతులు

Turkey-Syria Earthquake | భారీ భూకంపాల కారణంగా తుర్కియే, సిరియాలో మృత్యుహేళ ఇంకా కొనసాగుతున్నది. రోజు రోజుకు మృతుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 15వేలమందికిపైగా మృత్యువాతపడగా.. 50వేల మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. ఇంకా పెద్ద ఎత్తున జనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. భారీ ప్రకంపనలతో నేలమట్టమైన భవనాల్లో ఎక్కడ శిథిలాలను వెలికి తీస్తున్నా అక్కడ మృత్యువుతో పోరాడుతున్న, నలిగిపోయి చనిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తున్నాయి. భారీ శక్తివంతమైన భూకంపాలతో దెబ్బతిన్న తుర్కియే, […]

తుర్కియే, సిరియాలో మృత్యుకేళీ.. 15వేలు దాటిన మృతులు

Turkey-Syria Earthquake | భారీ భూకంపాల కారణంగా తుర్కియే, సిరియాలో మృత్యుహేళ ఇంకా కొనసాగుతున్నది. రోజు రోజుకు మృతుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 15వేలమందికిపైగా మృత్యువాతపడగా.. 50వేల మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. ఇంకా పెద్ద ఎత్తున జనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. భారీ ప్రకంపనలతో నేలమట్టమైన భవనాల్లో ఎక్కడ శిథిలాలను వెలికి తీస్తున్నా అక్కడ మృత్యువుతో పోరాడుతున్న, నలిగిపోయి చనిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తున్నాయి. భారీ శక్తివంతమైన భూకంపాలతో దెబ్బతిన్న తుర్కియే, సిరియాలో భూకంపాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూర్దగిరి నగరంలో రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించిదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

శిథిలాల కింద మృత్యువుతో పోరాడుతూ..

ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం భారీ నుంచి తప్పించుకున్న వారంతా తమ కుటుంబ సభ్యుల కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు. అయితే, భారీ విధ్వంసంతో తుర్కియే, సిరియాలో శిథిలాల కింద పెద్ద సంఖ్యలోనే జనం ఉన్నారు. అయితే, వారికి సహాయం అందించేందుకు రెస్క్యూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నది. భారత్‌ సహా పలు ప్రపంచదేశాలు రెస్క్యూ సిబ్బందిని పంపినా.. ఇంకా సిబ్బంది కొరత వేధిస్తున్నది. ఫలితంగా శిథిలాల కింద నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆర్తనాదాలు చేస్తున్నా వినిపించుకునే నాథుడే లేడన్న పరిస్థితి నెలకొన్నది.

భూకంపం సృష్టించిన విధ్వంసంతో కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో చలి పంజా విసురుతున్నది. తుర్కియే, సిరియాలో విపరీతమైన చలి ప్రజలను ఇబ్బందులకుగురి చేస్తున్నది. ఇండ్ల నేలమట్టమవడంతో బహిరంగ ప్రదేశాల్లో తలదాచుకుంటున్న జనానికి చలి మరింత కలవరానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వైపు స్థానిక రెస్క్యూ సిబ్బందితో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం చలిని లెక్క చేయకుండా.. మంచుకురుస్తున్నా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.